ఈసారి హాథీరామ్ జీ గా

22 Jan 2016


   రొమాన్స్, డివైన్,యాక్షన్, లవ్ స్టోరీస్, మైథలాజికల్, ఫాంటసీ..ఇలా ఎన్ని జోనర్లు ఉన్నాయనుకుంటే..అన్నింటిలో క్యారెక్టర్లు చేసింది నాగార్జున ఒక్కడే.. ఐతే అతని గ్లామరే ప్రధానం కాబట్టి నాగ్ అనగానే మంచి రొమాంటిక్ క్యారెక్టర్లే గుర్తొస్తాయ్.. అన్నమయ్య,శ్రీరామదాసు,షిర్డీశాయి లో భక్తిప్రధాన పాత్రల్లో నటించిన నాగార్జున మరోసారి ఆ తరహా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. వేంకటేశ్వరస్వామి భక్తుడు హాథీరామ్ జీ గా నటించబోతున్నాడు..డైరక్టర్ రాఘవేంద్రరావ్.. తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లే భక్తులకు ఎడమచేతివైపు (గతంలో వేయి కాళ్లమండపం ఉంటే స్పష్టంగా కన్పించేది) ఓ విగ్రహాల దృశ్యం కన్పిస్తుంది.. స్వామితో ఓ భక్తుడు చదరంగం ఆడుతున్నట్లుగా ఉన్న దృశ్యమది.. ఆ భక్తుడే ఈ హాథీ రామ్ బాబాజీ ..ఆయన పేరిట తిరుమల కొండపై మఠం కూడా ఉంది..విజయాల పరంగా చూసుకుంటే..రాఘవేంద్రరావ్ టైమ్ ఏమీ బాలేదు..శిరిడీ సాయి అట్టర్ ఫ్లాప్ .. కేవలం పేరు..చరిత్రలో స్థానం కోసమే..ఇలాంటి భక్తిరస ప్రధాన చిత్రాలు రూపొందిస్తారు..ఆ క్రమంలో కొన్ని ఘనవిజయాలు వస్తుంటాయ్ కూడా.. వెంకటేశ్వర స్వామి కథతో ఓ సినిమా చేస్తున్నట్టుగా చాలాకాలం క్రితమే ప్రకటించినా ఇప్పటికి అది ఫైనలైజ్ అవుతోంది..  సోగ్గాడే చిన్నినాయనా  నాగ్, రాఘవేంద్రరావు దర్శకత్వంలో హాథీరాం బాబాగా నటించడానికి రెడీ అవుతున్నాడు. సో ఇక మరో భక్తిప్రధాన పాత్రలో నాగార్జునను చూడబోతున్నాం..వింత ఏంటంటే..ఇదే నాగార్జున ఇప్పుడు పరమభక్తితో మాట్లాడుతుంటారు కానీ అంతం సినిమా సమయంలో దేవుడనే శక్తిని నమ్మనని చెప్పేవారు..ఆ తర్వాతి కాలంలో తానే భక్తిరసపాత్రలు పోషించడం వల్లనో..నమ్మకాలు మారడంవల్లనో ఆస్తికులుగా మారిపోయారంటారు.

Nagarjuna is called as Tollywood Manmadhudu, but he did all type of movies like devotional movie and family movies. Again he is doing devotional movie called Hadhiram Ji.