గవర్నర్ పై మండిపడ్డ యాష్కీ

23 Jan 2016


           విభజన తర్వాత అటు ఏపీలో ఇటు తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయిన ఎంపిల్లో సారీ మాజీ ఎంపిల్లో మధుయాష్కీ  ఒకరుఅప్పట్లో ఎప్పుడేం జరిగేది నాకు తెలుసు. కేసీఆర్ పై కేసులు పెడతా అంటూ  తెగ హడావుడి చేసిన మధుయాష్కీ ఇప్పుడు తాజాగా గవర్నర్ నరసింహన్ పై పడ్డారుటిఆర్ఎస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారాయన. వాటర్ గ్రిడ్ పథకాన్ని గవర్నర్ ఏ అధికారంతో పరిశీలిస్తారంటూ మండిపడ్డారు ఈ మాజీ ఎంపి. పనిలో పనిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా విమర్శలు గుప్పించారు. రోహిత్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని. ఐమాక్స్ ను కూల్చుతామని చెప్పి ఇప్పుడెందుకు సైలెంటయ్యారని నిలదీశారు
           విద్యుత్ ఒప్పందాల్లో 200కోట్ల రూపాయలు చేతులు మారాయంటూ ఆరోపించారు మధుయాష్కీ. ఐతే ఈ ఆరోపణలన్నీ గత ఉపఎన్నికలు. స్థానిక ఎన్నికల్లోనూ చేశారు. జనం పట్టించుకోలేదు. ఐనా అదే పాట పాడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఎప్పుడు మారతారో ఏంటో

Congress Ex MP Madhu Yashki recently appear in TV channel. Today he was fired on governor Narasimhan, that is acting as favor to Telangana government.