కిషన్ రెడ్డి ఇక మారడా..?

20 Jan 2016


       నోరు జారడంలో బిజెపినేతలకు మించినవారు ఉండరేమో అన్పించకతప్పదు..క్యాంపస్ తో పాటు..దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో విద్యార్ధులు ఏపీ విద్యార్ధి రోహిత్ మృతిపై రగులుతుంటే..ఆయన స్పందన మరీ విడ్డూరంగా ఉంది..అసలు రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని..ఆ సంగతి సూసైడ్ నోట్ లోనే ఉందంటూ వ్యాఖ్యానించడం ఏ రకంగా సమర్ధించుకుంటారో తెలీడం లేదు..రోహిత్ అగ్రవర్ణాల విద్యార్ధుల ధోరణి..వర్సిటీ సిబ్బంది వేధింపులు..సస్పెన్షన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడనేది అందరికీ తెలిసిందే..ఐతే ఇది వారంతా కలిసి చేసిన హత్యగానే భావిస్తుంటే..కిషన్ రెడ్డి మాత్రం అమాయకంగా..సూసైడ్ నోట్ లో ఏముందో కూడా తెలీకుండా మాట్లాడటం అందరికీ ఆగ్రహాన్ని కలగజేస్తోంది.. నీ పార్టీ నేతను కాపాడుకుంటే కాపాడుకో కానీ..ఇలా అడ్డంగా వాదిస్తే..వచ్చే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని విద్యార్ధులు హెచ్చరిస్తున్నారు..గతంలో 2004 ఎన్నికలకు ముందు ఇదే బండారుదత్తాత్రేయ రైతులు ఆత్మహత్యలెందుకు చేసుకుంటున్నారంటే..తిన్నది అరక్క అంటూ కామెంట్ చేసి ప్రజాగ్రహానికి గురైన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది..ఇంత విషాదం చోటు చేసుకున్న తర్వాత తీరిగ్గా.. రోహిత్ ఆత్మహత్య యూనివర్సిటీ అంతర్గత వ్యవహారం అంటున్న కిషన్ కు  అసలు యూనివర్సిటీలో గొడవల సంగతి వీసీనో..రిజిస్ట్రార్లో చూసుకుంటారని వదిలేయక...చర్యలు తీసుకోండంటూ సిఫార్సు లేఖ ఇచ్చింది కాక..ఇలా అడ్డగోలు వాదనలు చేయడం ఏంటని విద్యార్ధులతో పాటు..జనం కూడా ప్రశ్నిస్తున్నారు..మరి జవాబు చెప్తావా కిషన్ రెడ్డీ..?

BJP Telangana leader is the care of address. Recently he commented on HCU student Rohit suicide case, on one is not responsible for this case.