అసలు విషయం బైటపెట్టారు

20 Jan 2016


          తెలంగాణలో టిడిపితో దోస్తీ కిషన్ రెడ్డికి అసలు ఇష్టం లేదు..ఇదీ 2014 ఎన్నికలకు ముందు టాక్..ఇప్పుడది మరోసారి ప్రూవైంది..సాక్షి ఛానల్ డిబేట్ లో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారాయన. తమది నేషనల్ పార్టీ కాబట్టి..అధిష్టానం నిర్ణయాల మేరకు నడుస్తున్నామని చెప్పిన కిషన్ రెడ్డి ..గ్రేటర్ పీఠం మాత్రం దక్కించుకుంటామని చెప్పడం విడ్డూరం..మనసులు కలవని దోస్తీతో పోటీలో నిలవడమే కష్టం అనుకుంటే..మళ్లీ గెలవడం పై కూడా కామెంట్లు ఎందుకంటూ కేడర్ నీరసపడిపోతోంది..ఐతే పనిలో పనిగా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అంటే 2019నాటికి అధికారంలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారాయన..అంటే ఇది టిడిపితో జట్టు విడిపోవడం ఖాయమనే సంకేతాలు ఇస్తోంది..ఎందుకంటే ఇప్పుడు ఉన్న అసెంబ్లీ స్థానాలే అప్పుడూ ఉంటాయ్..అప్పుడు కూడా బిజెపికి ఏ 50,40 సీట్లు టిడిపి ఇవ్వజూపుతుంది..అలాంటిది పోటీ చేసే సీట్లే మెజార్టీవి లేనప్పుడు ఇకఅధికారంలోకి ఎలా వస్తారు..అందుకే సొంతంగా బరిలో ఉంటారు కాబట్టే..కిషన్ రెడ్డి ఈ కామెంట్లు వదులుతున్నారని అర్ధమవుతోంది.. 

Biggest topic in Telangana state is GHMC elections. In this election TDP and BJP are working together. BJP is central party so Kishan Reddy following party commands but he has no interest to work with TDP.