హాస్యం..హాస్యం.

28 Jan 2016


             గ్రేటర్ సిటీ ఎలక్షన్లలో మంత్రి కేటీఆర్, చంద్రబాబు తనయుడు వాడుతున్న పదజాలం బోలెడంత వినోదాన్ని పంచుతున్నాయ్. తమ్మీ మీరు హైదరాబాద్ కి గెస్ట్ లు అమరావతి డెవలప్ మెంట్ మీరు చూస్కోండి. ఇక్కడ అందరినీ మేం బాగానే చూసుకుంటాం అని కేటీఆర్ సెటైర్లు వేస్తే, లోకేశ్ నేనీడ్నే పుట్టా నువ్వే గుంటూర్లో చదివినవ్ అన్నా అంటూ కవుంటర్ ఇచ్చాడు. ఇక్కడ ఇద్దరూ ఎవరి లోపాలను వాళ్లు బాగానే ఎత్తి చూపుకున్నారు.

           ఐతే ఈ సందర్భంలో వాళ్లు మాట్లాడుతున్న మాటలు కోటలు దాటుతున్నాయ్. లోకేశ్ చెప్తున్నదాని ప్రకారం కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఇళ్ల నిర్మాణపథకం కోసం సమాచారం అడిగితే. కేసీఆర్ పట్టించుకోలేదని చంద్రబాబే రంగంలోకి 50వేల ఇళ్లు ఇప్పించారట. అలానే సిటీలో టిడిపిని గెలిపిస్తే మెట్రోని ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఆఫరిచ్చాడు లోకేష్ని జానికి మెట్రో అనేక దశల్లో పూర్తయ్యే ప్రాజెక్టు దాని పరిధి 73 కిలోమీటర్లకు పెంచారు. ఎటూ రేపు జూన్ కు ఓ దశ పూర్తై ఓ వైపు పరుగులు తీయడానికి సిధ్దంగా ఉఁది. ఇక దాన్ని టిడిపి గెలుపుతో ముడిపెట్టడం ఏ రకంగా సబబో టిడిపి నేతలకే తెలియాలి. అలానే కేటీఆర్ కూడా ఇక్కడ స్థిరపడ్డ వారిని గెస్ట్ లుగా పోల్చడంపై కూడా విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయ్. ఆయన ఎక్కడ పుట్టాడో..పెరిగాడో..చదువుకున్నాడో తెలిసి కూడా సిటిలో పుట్టిపెరిగినవాడిలా మిగతావాళ్లను గెస్ట్ లని అనడం ఎంతమాత్రం సరికాదు.
In GHMC election campaign both TRS and TDP party princes are fighting with comments and creating fun to people. KTR saying settlers are my guests and Lokesh is saying i born here.