మాట ఇచ్చాడంటే...తప్పేవాడేనా కేసీఆర్..?

22 Jan 2016


             మాటలు చెప్పమంటే..అరచేతిలో వైకుంఠం..కళ్లముందు కైలాసం చూపించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారని అంటుంటారు.. ఖచ్చితంగా ఏడాది గిర్రున తిరిగింది..పండగ తర్వాత వచ్చిన కేసీఆర్ పాలమూరు జనానికి ఇచ్చిన వాగ్ధానాలకు అంతే సమయం..మరి ఏమైనా ఆ హామీలు గుర్తున్నాయా గురువుగారికి అంటే నో కామెంట్..అస్సలు మీ బస్తీల పండుకుంట..డబుల్ బెడ్ రూమ్స్  కట్టిస్త..నాకు భోజనం భీ పెట్టాలే..అనుకుంటూ సెంటిమెంట్ ఆయింట్ మెంట్ పూసిన సిఎం సారు..మళ్లీ ఎప్పుడొస్తడని మహబూబ్ నగర్ జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారిప్పుడు..

వాటర్ ప్లాంట్, ఆడిటోరియం..బైపాస్ రోడ్డు..ఇలా ఏ హామీ గుర్తొస్తే అది పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ మరి ఎందుకు వాటిని పూర్తి చేయడం లేదని వాపోతున్నారు. ఏ సిటీకి వెళ్లినా..సారీ ఏ ఊరికి వెళ్లినా హామీల తీరులో మార్పుండదు..కరీంనగర్ జిల్లాలో కూడా సేమ్ సీన్..థేమ్స్ నది అంటడు..ట్యాంక్ బండ్ లెక్క చేస్తనంటడు..బర్త్ డే పార్టీ అంటే..పుట్టినరోజు వేడుకలని కూడా అర్ధం చెప్పి మరీ డెవలప్ చేస్తానని కేసీఆర్ బోలెడన్ని ఆశలపల్లకీలు మోశారు..మరెప్పుడు అవి పూర్తవుతాయో అని జనం ఎదురు చూస్తున్నారు.

Telangana CM KCR giving more promises to people. I will construct double bed room flats for poor people etc.. But he is forgetting all the promises.