కేసీఆర్ ది అందితే జుట్టు..అందకపోతే కాళ్ల నైజమా..?

13 Jan 2016


            గ్రేటర్ ప్రచారంలో నోటికి తెగ పని చెప్తున్నారు నేతలు..గత చరిత్రలు తవ్వుకుంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు..తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు..సీమాంధ్రులను సిటీనుంచి పంపేయడానికే సమగ్రసర్వే చేపట్టారని ఆరోపించారాయన..అసలు కేసీఆర్ కుటుంబానిది అందితే జుట్టు అందకపోతే కాళ్లనే నైజమని మండిపడ్డారు.. అందుకే ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ భీమవరంవాసులతో జరుపుకున్నారంటూ ఎద్దేవా చేశారు.. భీమవరం కాంట్రాక్టర్లతో కేటీఆర్ కు రిలేషన్లున్నాయని ఆరోపించారు.ఇక కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటీఆర్ కు సిటీలో వార్డులే తెలియదన్నారు..ఇప్పుడేదో హడావుడి చేస్తున్నారని..అసలు డెవలప్ మెంట్ కు కేరాప్ అడ్రస్ తామేనంటూ భుజం చరుచుకున్నారు.. ఐతే సీమాంధ్రులను టిఆర్ఎస్ దువ్వుతుందంటున్న టీ.కాంగ్రెస్ నేతలు గతంలో తాము ఎలా వ్యవహరించిందీ గుర్తుకుచేసుకోవాలని కొందరు కామెంట్ చేస్తున్నారు..

Now hot topic in Hyderabad is GHMC elections. For that all party leaders are doing many tricks. KCR behave as cunning.