రెగ్యులర్ రూట్ లోకి జూనియర్

26 Jan 2016


               ఎన్టీఆర్ పేరంటేనే ఓ మాస్ మేనియా తాత నుంచి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జూనియర్ పాతిక సినిమాలు చేసినా మాస్ జనానికి తప్ప క్లాస్ సినిమాలు చేయడం మనోడికి కలిసిరాలేదు. బుడ్డోడు బుడ్డోడు అని మాటకోసారంటే గుడ్డలూడదీసి కొడతానంటూ వార్నింగిలివ్వడం, అమ్మతోడు అడ్డంగా నరకడం లాంటి డైలాగులే తప్ప ఇంకేరకమైన పంచ్ లు మనోడి నుంచి ఎక్స్ పెక్ట్ చేయరు కూడా. ఐతే ఇప్పుడు నాన్నకు ప్రేమతో సినిమాతో క్లాస్ టచ్ కోసం ట్రై చేశాడు. ఐతే ప్రతిసారీ  ఇలాంటి క్యారెక్టర్లు కుదరవ్ కాబట్టి ఇక తన రెగ్యులర్ ఫార్మాట్ లోకి వెళ్లబోతున్నాడు. వరస హిట్లతో ఊపుమీదున్న కొరటాలశివ డైరక్షన్లో వస్తున్న జనతా గ్యారేజ్  షెడ్ లోంచి బయటకు వస్తున్నాడు.

        మసాలా ఐటెమ్స్ తో ఈ మూవీ ఉంటుందని టాక్. మిర్చిలాంటి సినిమానే కావాలని జూనియర్ పట్టుబడుతున్నట్లు టాక్. ఎప్పట్నుంచో పెద్ద సినిమాలకు దూరంగా ఉన్న సారధీ స్టూడియోలో ఇప్పుడు రెండున్నరకోట్లరూపాయలతో భారీ సెట్ వేస్తున్నారట. సో అటు తాత ఎన్టీఆర్ కూడా సారధీ స్టూడియోలో అనేక సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయ్. మళయాళ నటుడు మోహన్ లాల్, నిత్యామీనన్ ఇందులో నటించబోతున్నారు. రిలీజ్ డేట్ ఆగస్ట్ 12 అని ముందే ఎనౌన్స్ చేసారు.
Jr NTR completed 25 movies with Nannaku Prematho. But till now he did not reached to class audians. And again he is doing a mass movie, for that with 2.5cr a set is constructing in Saradhi studios. In this movie Mohan Lal, Nitya Meenan are also doing.