జూనియర్ ఆల్ టైమ్ రికార్డ్

27 Jan 2016            సినిమా కలెక్షన్ల విషయంలో ఏ హీరో కా హీరో ఎప్పటికప్పుడు రికార్డులు బద్దలు కొట్టుకుంటూ పోతున్నారు. గతంలో ఆల్ టైమ్ హిట్టంటే కనీసం ఓ ఐదేళ్లపాటు పదిలంగా ఉండేవి, ఐతే ఇప్పుడు ఏ ఏటికి ఆ ఏడాది కొత్త రికార్డులు బద్దలవుతున్నాయ్. మగధీర,దూకుడు, అత్తారింటికి  దారేది, బాహుబలి, శ్రీమంతుడు. ఇలా ప్రతీ సినిమా ఒకదాన్నొకటి దాటుకుంటూ పోయాయ్. ప్రస్తుతానికి బాహుబలి నంబర్ వన్ కాగా. శ్రీమంతుడు నంబర్ 2 గా సాగుతున్నాయ్. ఇప్పుడు పొంగల్ పోరులో విడుదలైన నాన్నకు ప్రేమతో సినిమా కలెక్షన్లు ఇరగదీస్తున్నాయని జూనియర్ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఓవర్ సీస్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్న  అత్తారింటికి దారేది సినిమాను నాన్నకు ప్రేమతో క్రాస్ చేసిందని అంటున్నారు.

                పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన అత్తారింటికి దారేది విదేశాల్లో 11.34 కోట్లు వసూలు చేసిందట. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో పదిరోజుల్లోనే 17 లక్షల మార్జిన్ తో క్రాస్ చేసిందట. ఇప్పటిదాకా ఓవర్సీస్ లో కింగైన మహేష్ శ్రీమంతుడు ను క్రాస్ చేస్తాడా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. మరో  వారం రోజులు ఆగితే ఫుల్ డీటైల్స్ వచ్చేస్తాయ్.

Present total Tollywood is depending on records. All big stars are always breaking all records. Now NTR latest movie break Pavans Atharintiki Dharedi record. It collects 17lks with in ten days.