డీఎన్ఏ కుదురుతుందా

27 Jan 2016


             నేషన్ హీరో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన ఏ అఁశమైనా చదవడానికి వినడానికి బాగానే ఉంటుంది. ఎఁదుకంటే మన ముందు లేని ఓ తరం నేతకు హీరోయిజం ఆపాదించాం పైగా అనేక దేశాలతో సత్సంబంధాలు నెరిపిన నాయకుడు మరణంపై అనేక గాసిప్స్. ఓ సినిమాటిక్ జీవితం గడిపిన నేతాజీ 1945 విమాన ప్రమాదంలోనే మరణించారని ఇటీవల బైటపెట్టిన ఫైల్స్ ప్రకారం కూడా అనుకోవాలి. ఇక్కడ ఓ విషయంతెలుసుకోవాలి ప్రభుత్వం ఏ వాదనను, వాస్తవాన్ని బయట ప్రచారం చేస్తుందో. అదే అంశాలు సీక్రెట్ ఫైళ్లు కానీ, ఓపెన్ ఫైళ్లలో కానీ ఉంటాయే తప్ప. ఇతర రహస్యాలు అఫిషియల్ ఫైళ్లలో ఉఁచదు. అందుకే కొత్త అంశాలేం సీక్రెట్ ఫైళ్లతో బయటకురాలేదు. 

           ఇప్పుడు మళ్లీ పాతడిమాండ్ తెర పైకి వచ్చింది. అదే జపాన్ రింకోజీ ఆలయంలో ఉన్న చితాభస్మానికి డీఎన్ఏ పరీక్ష చేయించాలని బోస్ కుమార్తె అనితా బోస్ కోరుతున్నారట. ఈమె ఆల్రెడీ పోయిన వారం బోస్ ఆ ప్రమాదంలోనే మరణించారని నమ్ముతున్నా అని చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఇలా అనడంలో అర్ధం ఏంటో ఆమెకే తెలియాలి.

Netaji Subhash Chandra Boss is great freedom fighter. But his death matter is still mystery. Recently Boss death files are released by government, i.e., He died in 1945 in flight accident. But his daughter Anitha Choudary is not agree with this matter and want DNA test.