మహేష్,కృష్ణతో కాంబినేషన్

28 Jan 2016              హీరోగా, కామెడీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిణామక్రమంలో మారిపోయిన నటుడు నరేష్. చక్కని పాత్రలు చేయడంలో మంచి  పేరు సంపాదించాడు. ఓ దశలో తెలుగుసినిమాను హాస్యం ఏలినకాలంలో నరేష్, రాజేంద్రప్రసాద్ మాత్రమే దానికి కేరాఫ్ అడ్రస్ గా మారారు. తర్వాతి కాలంలో రాజేంద్రప్రసాద్ ఇంకా మెయిన్ రోల్స్ లో చేస్తుండగా. నరేష్ మాత్రం పూర్తిగా సైడ్ క్యారెక్టర్లకే పరిమితమైపోయారు. ఇవాళ్టితో నరేష్ కు 51 ఏళ్లు నిండుతాయ్. 

               ప్రేమసంకెళ్లు, రెండు జళ్ల సీత, నాలుగు స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ ,ముక్కోపి, పోలీసు భార్య, చిత్రం భళారే విచిత్రం, ఆమె, జంబలకిడిపంబ వంటి సినిమాల్లో నటించిన నరేష్. యాక్షన్ మూవీస్ లో కూడా నటించాడు.. తల్లి విజయనిర్మల ప్రోత్సాహంతో పండంటి కాపురంతో సినిమాల్లో ప్రవేశించిన నరేష్. ఆ తర్వాత కాలంలో అందరి ప్రశంసలూ పొందారు. రాజకీయరంగంలోనూ ప్రవేశించిన నరేష్ ఇప్పుడు తన పూర్తికాలం సినిమాలకే అంకితమంటున్నారు. ప్రిన్స్ మహేష్ తో బ్రహ్మోత్సవంలో నటించిన నరేష్, సూపర్ స్టార్ కృష్ణ లేటెస్ట్ ఫిల్మ్ శ్రీశ్రీలో కూడా ఓ ముఖ్య పాత్ర చేశారు. అలా తండ్రీకొడుకల కాంబినేషన్ లో  ఒకే సంవత్సరం నటించడం తనకు ఎంతో ఆనందం ఇచ్చిందని నరేష్ చెప్తున్నారు.
Hero, comedian, character artiest Naesh bithday is today. To day he was completed 51 years. In this function he is saying now he is doing a movie with Mahesh and Krishna.