నేనే పెద్ద రౌడీనంటున్న బాలకృష్ణ

21 Jan 2016


              డిక్టేటర్ ఫలితం సంగతేమో కానీ..నందమూరి బాలకృష్ణ వీరాలాపాలకు అంతు లేకుండా పోతోంది..ఆడియో విడుదల రోజు నుంచీ ఇప్పుడు సినిమా ప్రమోషన్ల వరకూ బాలయ్య తెగ కష్టపడిపోతున్నాడు..అడిగినవాళ్లకు అడగనివాళ్లకు తన పంచ్ డైలాగ్స్ తో తెగ వినోదం పంచుతున్నాడు..సమయం అక్కర్లేదు..సందర్భం అసలే పట్టించుకోడు..రజనీకాంత్ నైనా లెక్కచేయనన్న బాలకృష్ణ ఇప్పుడు ప్రపంచంలోనే తనకంటే పెద్ద రౌడీ ఎవడూ లేడంటూ అందరి సమక్షంలో ప్రకటించుకున్నాడు.డిక్టేటర్ విజయోత్సవం అంటూ జరుగుతున్న ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన బాలకృష్ణ ఎప్పటిలాగే తన తండ్రి ఎన్టీఆరే తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చాడు.. లెజెండ్ అంటే ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పిన బాలయ్య అంతటితో ఊరుకోకుండా ఢిల్లీ జామా మసీద్ దగ్గర డిక్టేటర్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ సంఘటనను ఆడియెన్స్ కు చెప్పాడు..లోకల్ ఏరియాలో బౌన్సర్లను తనని తిరగవద్దని..ఇక్కడ రౌడీల బెడద ఎక్కువని చెప్పారట..ఐతే నాకంటే ఎవడూ పెద్ద రౌడీ లేడని వారికి చెప్పి..ఆ ఏరియాలో ఫోటోలు దిగాడట బాలయ్య..అక్కడి వారికి ఆటోగ్రాఫ్ లు కూడా ఇచ్చానని చెప్పాడు..మరి ఇది వినగానే ఫ్యాన్స్ ఊరుకుంటారా..చప్పట్లు కొట్టే ఉంటారు.. ఇదే  ఈవెంట్ లో నటుడు సుమన్ కూడా పాల్గొన్నాడు..ఎన్టీఆర్ తో పని చేయలేదనే బాధ..బాలకృష్ణతో నటించడం ద్వారా తీరిందన్నాడు సుమన్..

Bala Krishna now very busy in Dictator movie promotions. In this promotions he is entertaining fans with his dialogs, in this way he told that i am the biggest rowdy in this world.