ఐడెంటిటీ క్రైసిస్సా..లేక ఐకానిక్ మూమెంటా

21 Jan 2016


           రెబల స్టార్ అంటే గుర్తొచ్చేది కృష్ణంరాజే..ఎన్నో గొప్ప హిట్ సినిమాలు..నటుడిగా మంచి చిత్రాలు అందించిన కృష్ణంరాజు అంటే ఇప్పటితరానికి ఖచ్చితంగా తెలియకపోవచ్చు..కానీ ప్రభాస్ పెదనాన్న అంటే మాత్రం తెలుస్తుంది..ఎందుకంటే..1995 తర్వాత కృష్ణంరాజు సోలో హీరోగా వచ్చిన సినిమాలు అరడజనుకు మించి ఉేండవ్..ఇది 2016సంవత్సరం..ఇప్పటికి 21ఏళ్ల యూత్ కి ఈయన ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుస్తారు తప్ప గతంలో సాధించిన విజయాలు అందుకున్న మైలురాళ్లు తెలీవు..అదే మిగిలిన సూపర్ స్టార్ కృష్ణ,శోభన్ బాబు వేరు..వాళ్లు వేసిన ముద్ర వేరు..ఇప్పుడెందుకు ఈ పోలిక అంటే..కృష్ణంరాజు పుట్టినరోజు ఇవాళ..నటుడిగా ఈ ఏడాది జూన్ 10కు యాభైఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు..ఈలోపే యాభైఏళ్ల రెబల్, ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఇంటర్వ్యూల వరద తెలుగు ప్రేక్షకులపై వచ్చి పడుతోంది..కృష్ణవేణి,గాంధీ పుట్టిన దేశం, అమరదీపం,భక్తకన్నప్ప,బొబ్బిలిబ్రహ్మన్న,ప్రాణస్నేహితులు,రావణబ్రహ్మ,తాండ్రపాపారాయుడు,రావణబ్రహ్మ,బారతంలో శంఖారావం..ఇలా ఎన్నో మేలి చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన కృష్ణంరాజు..ఈ మధ్య తెరకు దూరమయ్యారు..భార్య మరణించగా..ఆమె సోదరినే వివాహం చేసుకున్న తర్వాత రాజకీయపరంగా మంత్రిపదవిని..కుటుంబపరంగా వారసులను అందుకున్నారాయన..ఇది కూడా లేటు వయసులో అంటే 55వ ఏట జరగడం ఆయన అదృష్టంగా చెప్తారు..ఐతే తన నటనకు వారసుడిగా సోదరుని కుమారుడు ప్రభాస్ ను టాప్ రేంజ్ కు తీసుకొచ్చిన కృష్ణంరాజు ఇప్పుడు కొత్తగా పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.గతంలో ఈ సంప్రదాయం లేదని ఆయన మాటల్లోనే తెలుస్తోంది..ఇప్పుడెందుకు ఇదంతా అంటే..సహజంగానే 60,70 ఏళ్లు వస్తే..తమ గొప్పదనాన్ని గుర్తించడం లేదనే బాధ అంతర్లీనంగా కలుగుతుందని చెప్తారు..అందుకే '' మా కాలంలో అయితే.. మా రోజుల్లో " అనే మాటలు వృధ్దుల నుంచి వింటుంటాం..ఇప్పుడు అలానే కృష్ణంరాజు కూడా తన గత వైభవాన్ని నెమరువేసుకోవడం కోసం..అభిమానులను కలుసుకోవడం కోసం ఇలా చేస్తున్నారంటారు..వాస్తవంగా కూడా..కృష్ణంరాజుకు ప్రభుత్వం తరపున ఎలాంటి గుర్తింపూ దక్కలేదు..అసలు ప్రభాస్ ఈరోజున ఈ రేంజ్ లో లేకపోతే..ఆయన్ని పట్టించుకోరనడంలో సందేహం లేదు..దీనికి ఉదాహరణలు చెప్తాం చూడండి..కీర్తిశేషులుఎస్వీ రంగారావ్, కీర్తిశేషులు గుమ్మడి..కీర్తిశేషులు రాజబాబు,పద్మనాభం, రమణారెడ్డి,శోభన్ బాబు,జగ్గయ్య, నాగభూషణం, మిక్కిలినేని, ముక్కామల,నూతన్ ప్రసాద్, రావు గోపాలరావు..బతికి ఉన్న సత్యనారాయణ వీళ్లెవరిపైనా...ఏ ఛానల్లో వర్ధంతులు..జయంతి కార్యక్రమాలకు అరగంట ప్రసారాలు రావు..అదే మిగిలిన వాళ్లు చూడండి..ప్రతీ సందర్భానికీ ఓ అరగంట ప్రసారం ఉంటుంది..ఈసారి ఈ కోణంలో టీవీఛానళ్ల ప్రసారాలు చూడండి మేం చెప్పే సంగతిలో నిజం మీకే అర్ధం అవుతుంది

Rebel Star Krishnam Raju biggest hero in Tollywood before 1995. After he did only 5 or 6 movie only, present he has no offers. Now a days so many of young people dont know about Krishna Raju. Present Krishna Raju spending his time by memorizing his movies.