హిట్ అండ్ రన్ కుదరదు

28 Jan 2016


                  పద్నాలుగేళ్ల కేసు ఇంకా వెంటాడుతూనే ఉంది సల్మాన్ ను రాష్ గా కారు నడిపి ఒకరి ప్రాణాలు తీసిన కేసులో సల్లూఖాన్ పై ముంబై కోర్టులో వాదోపవాదాలు నడవగా సెషన్స్ కోర్టు జైలుశిక్ష విధించింది. ఐతే సరైన సాక్ష్యాలు లేవనే సాకుతో, ప్రాసిక్యూషన్ ఆధారాలు కోర్టు ముందుంచలేదనే కారణంతో బాంబే హైకోర్టు ఆ శిక్షను రద్దు చేసింది. ఐతే వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పింది. అన్నట్లుగానే సుప్రీంలో పిటీషన్ వేసింది కూడా. ఈ ఫాస్ట్ డెవలప్ మెంట్స్ తో మనోడిలో కంగారు మొదలైంది.

               ఎక్కడ తన వాదన వినకుండానే జైలుకు పంపుతారనుకున్నాడో ఏమో కానీ సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసాడు. అసలీ కేసులో సల్మాన్ దోషి కాకపోతే. ఎందుకు మృతుడి కుటుంబసభ్యులకు పాతికలక్షల నష్టపరిహారం చెల్లించడానికి సిధ్దపడ్డాడో చెప్పాలని సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి కూడా. అలానే తన తరపున హైకోర్టులో వాదించిన లాయర్ కు ఎందుకు భారీగా ఫీజు చెల్లించాడో చెప్పాలని కూడా ట్వీట్లు పడ్డాయి. ఐతే చేసిన పాపానికి ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే. లేటవ్వొచ్చుకానీ ఇంతవరకూ ఏ దోషీ శిక్ష పడకుండా తప్పించుకోలేదనేది చరిత్ర చెప్పే వాస్తవం. చూద్దాం సల్మాన్ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.
From fourteen years Salman Khan is facing hit and run case. Till it taking different turning, present it is in Supreme court.