మరీ ఇంత శిక్షా

23 Jan 2016


                 మనదేశంలో నేరాలు చేయడం..విచారణల జాప్యంతో శిక్షలు పడుకుండానే బైటతిరగడం ఎక్కువ..ఐతే అమెరికాలోని ఓక్లహామా కోర్టు విధించిన శిక్ష చూస్తే..ఇక్కడ కూడా ఒక్కోసారి అంత ఫాస్ట్ గా తీర్పులొస్తే బావుండనిపిస్తుంది..మరోవైపు ఆ శిక్ష చూస్తే భయం కూడా కలుగుతుంది.. రెండేళ్ల క్రితం డేనియల్ హాల్డ్ క్లాక్ అనే పోలీస్ అఫిషియల్ అక్కడ స్త్రీలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్నాడు..అవి ఋజువు కావడంతో..డేనియల్ కు 263ఏళ్ల జైలుశిక్ష విధించింది..దానిపై ఉన్నత న్యాయస్థానాలకు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా లేకుండా  చేసింది..దీంతో కోర్టుహాల్లోనే డేనియల్ విపరీతంగా రోదించడం కలిచివేసింది..ఐతే ఇలాంటి శిక్షలు ఒకటి రెండు పడితేనే..నేరగాళ్లకు క్రిమినల్ ఆలోచనలు రాకుండా ఉంటాయనే వారూ ఉన్నారు. 

Thats way America is the Greatest Country in the world. Recently a man was arrested in the case of harassing ladies, and it was proved. So he was punished 263 years prison.