భేష్ జగన్..

26 Jan 2016


              కేంద్రం ప్రకటించిన పద్మపురస్కారాలు పొందిన తెలుగువారికి అభినందనలు పంపారు వైసీపీ అధినేత జగన్ పురస్కార గ్రహీతల ప్రకటనపై మిగతా వారి విమర్శల సంగతి ఎలా ఉన్నా సాటి తెలుగువారికి అవార్డులు పురస్కారాలు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారాయన. ఇందులో ప్రత్యేకించి రామోజీరావ్ గురించి ప్రస్తావించకతప్పదు కఠోరమైన జగన్ వ్యతిరేకతకు పెట్టింది పేరు ఆయన పత్రిక. ఇప్పటికీ అవకాశం దొరికిన ప్రతిసారీ వైసీపీకి నెగటివ్ వార్తలు రాయడంలోను ప్రజల్లో ప్రతికూలత పెరిగే వార్తలు రాయడంలో ముందుంటుంది ఆయన పత్రిక. 

               ఐనా సరే జగన్ రామోజీరావుకు ప్రత్యేకంగా అభినందనలు తెలపడం మంచి సంప్రదాయం..ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లిమరీ ఆయనతో భేటీ కావడంపై ఇతర మీడియాలో సంచలనం కలిగించినా జగన్ లెక్కచేయలేదు. ఎవరిని కలిసినా కేసుల మాఫీ కోసమంటూ గగ్గోలు పెట్టే పత్రికలకు కావాల్సినంత ఆహారం దొరికింది ఆ రెండు రోజులూ రామోజీరావుకు దాదాపు జీవితం చరమాంకంలో ఉన్నారు. ఆరోగ్యం సహకరించడం లేదనీ వార్తలు విన్పిస్తున్నాయ్. ఈ దశలో ఎంత వ్యతిరేకత ఉన్నా అది పక్కకు బెట్టి పెద్దాయన్ను కలవడంలో జగన్ కు ఎక్కడ తగ్గాలో తెలిసిందని నిజమైన రాజకీయ పరిణతి ఉన్నోళ్లు చెప్పారు కూడా. ఇప్పుడీ తాజా పరిణామం కూడా జగన్ అంటే అభిమానం ఉన్నవాళ్లలోఆయన ఇమేజ్ ఇంకాస్త పెరిగింది.
Yesterday Central government announced Padma Puraskaralu. Few of the Telugu people got these awards. For them YS Jagan congratulated, especially to Ramouji Rao is quit opposite to YS Jagan. Thats way hats up to Jagan.