బాలీవుడ్ లో హ్యాపీ డేస్

26 Jan 2016


             సెన్సిబుల్ డైరక్టర్ శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీడేస్ ఆయన కెరీర్ ని పీక్ కి తీసికెళ్లడంతో పాటు. యూత్ లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా. మైనే ప్యార్ కియా, నువ్వే కావాలి ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాతోనే యూత్ బాగా ఐడెంటిపై చేసుకున్నారు. ప్రతి కాలేజ్ లో యూత్ కలిసి మెలిసి తిరగడానికి ఇంజనీరింగ్ స్టూడెంట్ లైఫ్ ని బాగా తెరకెక్కించారు. అలాంటి సినిమా రావాలంటే ఇక ఓ పదేళ్లు ఖచ్చితంగా పడుతుందని అప్పట్లో అనుకున్నారు. 

           అదే నిజమైంది కూడా ఆ కోవలోనే ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఐనా ఆ రేంజ్ సక్సెస్ ఏదీ కాలేదు.  ప్రతీ సినిమా హృద్యంగా తీయడంలో ఎక్స్ పర్ట్ అయిన శేఖర్ కమ్ముల ప్రస్తుతం   హ్యపీడేస్ ను హిందీలో రీమేక్ చేయబోతున్నారట. ప్రొడ్యూసర్ సల్మాన్ ఖాన్ అని టాక్ నడుస్తోంది. మరోవైపు శేఖర్ సినిమా తీసి మూడేళ్లు అవుతుంది. అనామిక సినిమా మంచి ఫీల్ కలిగించేదే అయినా ఫ్లాప్ అవడంతో ఆయన కెరీర్ డల్ గానే ఉంది. శేఖర్ కపూర్ ,సల్మాన్ ఖాన్ జాయింట్ గా దీన్ని ప్రొడ్యూస్ చేస్తారని తెలుస్తోంది.
Shekar Kammula got biggest hit with Happy Days, till now no such type of movie. Present talk is Shekar is now doing this film in Bollywood and this film is producing Shalman Khan.