హ్యాపీ బర్త్ డే

28 Jan 2016
              శృతి హాసన్ నాజూకైన వళ్లు, మిలమిలమెరిసే కళ్లు, జలతారులాంటి పలువరుస, సన్నజాతి తీగెలా స్లిమ్ గా  కన్పించే శృతిహాసన్ బర్త్ డే  ఇవాళ. తండ్రి కమల్ హసన్ వారసురాలిగా కాకుండా సొంతంగా తన టాలెంట్ తోనే ఎదుగుతున్న శృతి హసన్ కెరీర్ బిగినింగ్ లో ఫ్లాప్ లు రావడంతో  ఐరన్ లెగ్ గా ఫీలయ్యారు. ఐతే ఆ తర్వాత హిట్లమీద హిట్లు కొడుతూ ప్రొడ్యూసర్లకు , హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. యూత్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ హార్ట్ త్రోబ్ గా మారింది. 
                 తెలుగులో అగ్రహీరోలైన మహేష్ , పవన్ కల్యాణ్, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ తో నటించి హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. ఇక మెగా ఫ్యామిలీ హీరోలతో కూడా హిట్లే కొట్టింది. రామ్ చరణ్, అల్లుఅర్జున్ ఇద్దరితోనూ స్క్రీన్ పంచుకున్న శృతిహాసన్ ప్రస్తుతం తెలుగులో నటిస్తున్న సినిమాలు కొన్నే అయినా. ఆమె క్రేజ్ మాత్రం కొదవేంలేదు. తమిళంలోనూ టాప్ స్టార్స్ తో నటిస్తున్న శృతి హాసన్ కు అభినయానికి అవకాశం ఉన్న పాత్రలు నిజానికి తక్కువే దొరికాయ్. ఐతే చేసిన సినిమాల్లోని తన పరిధి మేరకు ఆడియెన్స్ కు ఆనందం కలిగించడంలో మాత్రం ఆమెది పెద్ద పాత్రే అని చెప్పాలి. ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న శృతిహాసన్ కు ఆల్ ది బెస్ట్ చెప్దాం.
Great actor Kamal Hasan's daughter and Tollywood, Kollywood star heroin Shruthi Hasan bithday is today. He is debut in Telugu with young hero Sidharth, but later she did movies with all star and big heroes.