రోడ్ షో లో జనం ఇబ్బందులు

28 Jan 2016


               హైదరాబాద్ లో ఇప్పుడు పార్టీనేతలు చేస్తున్న ప్రచారం ఓటర్లను ఆకర్షించడం ఏమో కానీ జనాలను నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎక్కడ బడితే అక్కడ ఎప్పుడుపడితే అప్పుడు నడిరోడ్డుపై చేస్తున్న ప్రచారంతో
ఎక్కడిక్కడ ట్రాఫిక్ జాములైపోయి ఆయాలీడర్లపై జనం బండబూతులతో దీవిస్తున్నారు. ఐతే అవేం వాళ్లకు విన్పించడంలేదు కాబట్టి రోడ్ షోలు యధేచ్చగా సాగిపోతున్నాయ్. అమీర్ పేట,యూసఫ్ గూడ,ఎల్లారెడ్డి గూడ,జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, పంజాగుట్ట ఈ రోడ్లలో అటు టిడిపినేతలు, ఇటు టీఆర్ఎస్ నేతలు మధ్యలో సందు చూసుకుని కాంగ్రెస్ లీడర్లు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. 

                   తమ నేతలు లోకేశ్,రేవంత్ రెడ్డి, కేటీఆర్ తదితరులను పిలిపించుకుని ప్రచారవాహనాలపై గంటలకొద్దీ ప్రసంగాలు ఇప్పించుకుంటూ కాన్వాసింగ్ అదిరిపోయిందనిపించుకుంటున్నారు. నాలుగు రోడ్లు కలిసే చోట ప్రచారరధాలను నిలిపివేస్తే విపరీతంగా ట్రాఫిక్ జామవుతుంది, జనం కూడా నిలబడిపోవాల్సి వస్తుంది. దూరం నుంచిచూసేవాళ్లకు జనం భారీగా వచ్చిన  ఫీలింగ్. ఐతే ఖాళీగా ఉండే రోడ్లపై ప్రచారం చేస్తే జనం వస్తారో రారో  అనే అనుమానంతోనే ఇలా రద్దీ ఏరియాల్లో వీళ్ల రోడ్ షోలు సాగుతున్నాయ్. దీంతో జనం కిలోమీటర్ కదలడానికి పావుగంట పడుతోంది..దీంతో తమ నోటికి పని చెప్తున్నారు జనం.
Total Hyderabad is very with GHMC elections campaign of all parties. Especially in Ameerpet and KPHB, Jublihills etc are roads are very with with elections road shows, even walking in these roads are also difficult.