గబ్బర్ సింగ్ తో మాస్టర్

28 Jan 2016


             మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య ఎక్కువగానే మీడియాలో కన్పిస్తున్నారు. సినిమా చేసేదీ లేనిదీ ఎక్కడా చెప్పకపోయినా తన గెటప్స్ మాత్రం ఆసక్తి కలిగిస్తున్నాయ్. ఇప్పుడాయన తమ్ముడు పవన్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ కు వెళ్లి కాసేపు ముచ్చటించారు. ఆ ఫోటోలు ట్విట్టర్లో పోస్ట్ చేశారు ప్రొడ్యూసర్. ఐతే ఈ ఫోటోలు చూస్తుంటే. మెగాస్టార్ కానీ గెస్ట్ రోల్ చేయడం లేదు కదా అనే డౌట్స్ రావడం కామన్. ఐతే ఇటీవల కాలంలో మెగాస్టార్ కు పవన్ కల్యాణకు పడటం లేదనే టాక్ విపరీతంగా నడుస్తూనే ఉంది. ఇది ఎవరికి వారు కాదని ఖండిస్తున్నా ఈ వార్తలు ఆగవు. చిరంజీవి పుట్టినరోజు వేడుకకు బొకే ఇచ్చొచ్చిన తమ్ముడికి ఇప్పుడు అన్నయ్య బదులు తీర్చుకున్నాడు. 

               సర్దార్ గబ్బర్ సింగ్ యూనిట్ తో ములాఖత్ అయిన చిరు. కాసేపు సరదాగా మాట్లాడారట. ఆ తర్వాత షూటింగ్ ముచ్చట్లు క్షేమసమాచారాలు అడగడమే కాకుండా ఫోటోలకు ఫోజులిచ్చారు. 150వ సినిమాపై రభస చోటుచేసుకుంటున్న తరుణంలో మెగాస్టార్ ఇలా సినిమా స్పాట్స్ కు రావడంపై సందేహాలు వస్తున్నాయ్. ఖచ్చితంగా ఆయన సినిమా చేయబోతున్నారనే ఆయన పర్సనాలిటీ చూస్తుంటే అర్ధమవుతుందని ఫ్యాన్స్ చెప్తున్నారు. ప్రాజెక్టు పట్టాలెక్కేలోపు టచ్చింగ్ కోసమని ఇలా సెట్లు తిరగేస్తున్నారని కూడా అంటున్నారు.
Now Chiranjeevi is hot topic in media about his 150th movie and he is in very busy with politics and Movie story discussion. But today he went to Sardhar Gabbar Sing set and spend time with Pavan Kalyan.