కత్తికి పిడి

27 Jan 2016


             ఆలూ లేదు  చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది మెగాస్టార్ కత్తి సినిమా రీమేక్ విషయం. అసలు ఆయన చేస్తున్నాడో లేదో తెలీదు కానీ కత్తి సినిమాపై కాంట్రవర్సీ క్రియేటవుతోంది. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ఈ సినిమాపై కామెంట్లు చేయడం. ఆ తర్వాత కామ్ అయిపోవడం కామనైపోయింది. ఇప్పుడు ఆ కత్తి సినిమా కథ తనదేనంటూ నరసింహారావనే వ్యక్తి హడావుడి చేస్తున్నాడు. దానికి తోడు డైరక్టర్ దాసరి నారాయణరావు కూడా రంగంలోగి దిగి ఈ సంగతేంటో తేలేవరకూ సదరు సినిమా నిర్మాణంలో పాలుపంచుకోకూడందటూ అన్ని కార్మికశాఖలకు ఆదేశాలు జారీ చేశారట. దీంతో కత్తి  కథ రంజుగా మారింది కొన్నాళ్లుగా చిరంజీవికి దాసరికి పడట్లేదని టాక్ ఉండనే ఉంది. 

             ఇప్పుడు అందుకే దాసరి టైమ్ చూసి చిరంజీవి కత్తికి అడ్డంకులు వేస్తున్నారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇప్పటిదాకా నిర్మాతల మండలి..దర్శకుల యూనియన్ ఇలా విన్నాం కానీ కథాహక్కుల వేదిక అంటూ  ఉందని ఇప్పుడీ ఘటనతోనే బైటికి తెలిసింది. ఐతే కత్తి సినిమా తమిళ్ లో తీసారు, మురుగదాసే స్వయంగా కథకుడు కూడా ఇప్పుడాయనే తెలుగులో తీస్తున్నాడు. సో లీగల్ గా ఏ అడ్డంకులూ ఉండకపోవచ్చు. కానీ తెలుగులో దాసరి మాట అంటే 24శాఖల కార్మికులకు వేదవాక్కు అని చెప్తుంటారు. ఈ టైమ్ లో ఇలాంటి నిర్ణయం ఏ పరిణామాలకు దారి తీస్తుందో అని ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.

Total Tollywood is eagerly waiting for Chiranjeevi 150th movie. There were so many stories discussed for this movie. So total people are waiting for that movie. But Chiru today announced about his 150 th movie, he is doing Kathi movie as remake.