చుర'కత్తి' మీసాలా..?

21 Jan 2016


               బాలకృష్ణ ఊపు చూస్తుంటే వంద కాదు..నూట యాభై కూడా రెండు మూడేళ్లలోనే పూర్తి చేసేట్టున్నాడు..ఐతే ఈ స్పీడే మెగాస్టార్ కు పితలాటకంగా మారింది..శంకర్ దాదా జిందాబాద్ తర్వాత తెరపై కన్పించడం మానేసిన చిరు..కొడుకు రామ్ చరణ్ బ్రూస్ లీలో చివర్లో  ఓ ఐదునిమిషాలు మెరిశాడు..ఇంకా 150వ సినిమా అప్పుడు..ఇప్పుడంటూ హడావుడి లీకులే తప్ప..నిజంగా అదెప్పుడు ప్రారంభమవుతుందో తెలీక ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు..కొంతమంది ఐతే..ఇక అది 150 కాదు..151వది అంటూ రాసేస్తున్నారు కూడా..ఓ ఆంగ్లదినపత్రికలో ఇదే చిరు 151వ సినిమా గెటప్ అంటూ మీసాలు మెలేసిన చిరంజీవి ఫోటోలతో వ్యాసాలు కూడా రాసేస్తుంది(డీసీ).ఇది ఖచ్చితంగా మెగాస్టార్ అంటే పడనివాళ్ల దృష్టిని ఆకర్షించడం కోసమే అని తెలుస్తోంది..తమిళ కత్తి రీమేక్ లో చిరంజీవి నటిస్తారని టాక్ ఉంది..దీన్ని ఎవరూ ఖండించడం లేదు..ఐతే ఈ సినిమా కోసం పెంచారో..సరదాకో కానీ..చిరంజీవి ఈ మధ్య కోరమీసాలు పెట్టుకుని కన్పిస్తున్నారు..కత్తి లో తమిళ్ హీరో విజయ్ రెండు పాత్రల్లో పెద్దగా మార్పులేం చేయకుండానే కన్పిస్తాడు..మరి చిరంజీవి ఈ కోరమీసం గెటప్ తో ఒకటి..మామూలుగా ఒకటి చేస్తారేమో చూడాలి..ఐతే ఈ మెలిదిరిగిన మీసాలతో చిరంజీవి ముదురుగా కన్పిస్తున్నాడే తప్ప..యంగ్ లుక్ లేదు..అంతకుముందు తన షష్టిపూర్తి సమయంలో ఎలా కన్పించాడో..ఆ మేకప్ కంటిన్యూ చేస్తే చాలని ఫ్యాన్స్ ఫీలింగ్..ఐతే ఇదంతా సినిమా కోసం అయితేనే..ఇంకో సంగతి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి..ఇలా వాయిదాలు వేస్తూ పోయి..ఏదో ఎన్నికలకు ముందు రిలీజ్ చేసి ఇరగదీద్దామనే ప్లాన్లు పెద్దగా వర్కౌట్ కావు..ఎందుకంటే అప్పటికే మరో రెండేళ్లు మీదపడతాయ్..63ఏళ్ల వయస్సులో ఇక మూమెంట్స్ అన్నీ పరిమితం అవుతాయి..ఎంత గ్రాఫిక్స్ పై ఆధారపడ్డా ప్రయోజనం ఉండదు..చూస్కోండి మరి..!

Hot topic in Tollywood is Chiranjeevi's 150th movie. About this different talk are creating every day. Recently an english paper released a poster about his 150th movie.