బాబుకు జ్ఞానోదయం

25 Jan 2016


             ప్రపంచంలో ఏం జరుగుతుందో ఇప్పుడే తెలిందంటున్నారు చంద్రబాబు ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో ఠక్కున మాబాబు గారికే ముందు తెలుస్తుంది. ఆయనకున్నంత టెక్నాలజీ ఎవరూ వాడరంటూ టిడిపి తమ్ముళ్లు తెగ హడావుడి చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు సిఎం చంద్రబాబునాయుడు దావోస్ కు వెళ్లడం వలన తనకి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుకునే వీలు కలిగిందంటూ కామెంట్ చేయడం ఆశ్యర్యం కలిగిస్తోంది. దావోస్ లో ప్రవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో పరిస్థితులు మార్చుకున్నారని మనం కూడా ఆ రకంగా ముందుకు పోవాలని విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు చెప్పారు. 

        నవీనయుగంలో స్కిల్స్  డెవలప్ అయితేనే  ఏదైనా సాధించవచ్చని అలానే అభివృధ్ది సాధ్యపడుతుందన్నారు. మరి ఈ మాటలు నిజంగా ఆచరణకు నోచుకోవాలంటే ఉద్యోగాల కోసం  ఎదురుచూస్తున్న యూత్ కు నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన ఎందుకని ఉస్సూరంటున్నారు. మరి వారికి ఎలాంటి భరోసా ఇవ్వకుండా రెండు మూడు చోట్ల స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ట్రైనింగ్ సర్ఠిపికెట్లు ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. 

Recently CM Chandra Babu went to Davos to attract investments to AP. In a press meet he told that after he went Davos he got more information.