సరుకులపై బాబు బొమ్మ

18 Jan 2016


              ఏ ప్రభుత్వం అధికారం  లో ఉంటె ఆ పార్టీ తాలూకు ముద్ర ఉండాలనుకోవడం సహజమ్. అయినా  సరే కాస్తో కూస్తో సంయమనం పాటించక పోతే అభాసుపాలు కకతప్పదు. .. దివంగత నేత వై యస్సార్ ముఖ్యమంత్రి గ ఉండగా అమలు చేసిన పథకాలు కొన్ని ఖచ్తితంగా పార్టీ మైలేజ్ కోసం చేసారు అయితే అవి పేదవారికి మధ్యతరగతి వారికీ బ్రహ్మాండంగా మేలు చేసాయి కనుకే తర్వాత వచ్చిన వారు కూడా కొనసాగించారు కాకపోతే వాళ్ళ బొమ్మలు వెసుకున్నరు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రతి సంక్రాంతి కి ఇస్తున్న కానుకలు మరి విద్దురంగా ఉన్నాయని పల్లెటూళ్ళలో జనం నోళ్ళు నొక్కు కుంటున్నారు .. ఏమంటే.. అదేడో సొంత ఆస్తిలా ఆయన  నవ్వుతున్న ఫోటోలు పోసులు ఇస్తూ అలా ఒకటి రెండు రోజులకి కూడా సరిపోని సరుకులు ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి అని ఈసడిస్తున్నారు . అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇలానే తన ఫోటో లతో సంచులు పంపిణీ  చెశారు.. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ప్రజల హక్కు కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు ఈ కానుకలు సంచీ లను తిస్కున్నారు అయితె.. ఆ తర్వాత మళ్లీ  మళ్లీ  వాడుకోవడానికి మాత్రం ఇష్టపడటం లేదు..ఈ సంచులు కన్పిస్తే   దుకాణా దారులు ఎగతాళి చేస్తున్నారని కొంతమంది వాపోతున్నారు .. పేదలకుసాయం  చేయడం పండగ పూట  పాయసం తిన్పించాలనుకోవడం తప్పు ఎంత మాత్రం కాదు ..కాని కీర్తి కండూతి తో మన ఫోటోలు ప్రింటి చేసుకోవాలనుకుంటే నే ఇలా అభాసు పాలవుతారు

To this Pongal CM Chandra Babu gave Sankratri Kanuka to people. But people are laughing about this, in each item bag Chandra Babu laughing photo appearing.