ఆ నలుగురికీ మూడినట్లేనా

26 Jan 2016


    గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లాల్సిందిగా ఏపి సిఎం చంద్రబాబు నలుగురు మంత్రులకు ఆదేశాలిచ్చారు. శిధ్దారాఘవరావ్,అయ్యన్నపాత్రుడు,అచ్చెనాయుడు,రావెలకిషోర్ బాబు ను గ్రేటర్ ఎలక్షన్ కాన్వాసింగ్ కు వెళ్లాల్సిందిగా చంద్రబాబు కేబినెట్ భేటీలో చెప్పారు. ఐతే దీనికి రెండు కారణాలు కన్పిస్తున్నాయ్ ఒకటి ఈ ఎన్నికల్లో ఎక్కడా కేసీఆర్ ప్రచారానికి రావడం లేదు, కేటీఆర్ మాత్రమే తెగ తిరుగుతున్నాడు. అలానే చంద్రబాబు కూడా తన కొడుకునే రంగంలోకి దింపాడు. ఇప్పుడు తాను వెళ్తే స్థాయి తగ్గాడనే విమర్శ ఉంటుంది. దానికితోడు ఓడిపోతే ఆ విమర్శలు ఇంకా ఘోరంగా ఉంటాయ్. అందుకే చంద్రబాబు తాను కాన్వాసింగ్ కు వెళ్లడం లేదని టాక్. 

        ఇఁకో కారణం ఏంటంటే. ఇప్పుడు ఎవరినైతే జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి వెళ్లమన్నారో..వాళ్లపై చంద్రబాబు కొంతకాలంగా అసహనంగా ఉన్నారని తెలుస్తోంది..ఉద్వాసన అంటూ జరిగితే ఈ బ్యాచ్ లోని వాళ్లకే ఉంటుంది అంటారు. అందుకే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి వెళ్లమని ఆదేశాలిచ్చారట. ఓ ఎస్సీ,బీసీ,ఓసీ,కాపు సంఘాల ప్రతినిధులుగా హైదరాబాద్ ప్రచారానికి పంపాననే. కులాలలెక్కలు ఉఁండొచ్చు కానీ సిటీలో ఉర్దూ ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వీరి ప్రచారం ఎలా ఉపయోగపడుతుందో చంద్రబాబుకే తెలియాలి..
TDP national leader Chandra Babu ordered AP cabinet ministers Siddha Raghavarao, Ayyana Patrudu, Acche Nayudu, Ravela Kishore to go to elections campaign in Telengana. Because in Telangana CM KCR sent his son KTR to campaign. So CM ordered ministers for campaign.