నా పేరెందుకు చెడగొడుతున్నారు

26 Jan 2016


          దావోస్, సింగపూర్ టూర్ ముగించుకుని వచ్చిన ఏపి సిఎం చంద్రబాబు చాలా చికాకు మీదున్నట్లుంది. వచ్చీరాగానే మంత్రులకు తలంటి పోయడంతో పాటు, మీడియామిత్రులకు కూడా షాకులిచ్చేసారు. రుణమాఫీ చేస్తామని చెప్పా, చెప్పినట్లే చేశా వన్ టైమ్ సెటిల్ మెంట్ అని చెప్తున్న చంద్రబాబును ఓ విలేఖరి పూర్తిగా చేయలేదు లక్షన్నరమాత్రమే అయింది అని గుర్తు చేయపోగా. నీకు అలా చెప్పానా నీ కల్లోకి కానీ వచ్చి చెప్పానా అంటూ విసుక్కున్నారు. దీంతో సిఎం డైరక్ట్ గా అలా అడిగితే ఎంతపెద్ద పోటు రిపోర్టరైనా ఏం చేయగలడు. 

             అదలా ఉంచితే చంద్రన్న కానుకల పంపిణీ చాలా ఆధ్వాన్నంగా జరిగిందని సివిల్ సప్లైస్ డిపార్ట్ మెంట్ పై మండిపడ్డారు బాబు గారు. అంతకు ముందు ఆంధ్రాపల్స్ ఈ అంశంపై స్టోరీ ప్రచురించిన సంగతి పాఠకులకు గుర్తుండే ఉంటుంది. అవే అంశాలు చెప్తూ ప్రజలకు ఓ మంచి ఉద్దేశంతో చేపట్టిన పథకం అవకతవకలతో జరిగిందని చివరకు చెడ్డ పేరు నాకు వచ్చిందని అసహనంతో రగిలిపోయారు చంద్రబాబు. ఇప్పటికైనా ఏ పాలకులైనా గ్రహించాల్సింది ప్రభుత్వ పథకాలకు ప్రచారం అవసరమే కానీ అవి వ్యక్తిగత ఇమేజ్ కోసం కాదని గుర్తెరగాలి. ప్రజలకు  వాటిపై అవగాహన, పంపిణీలో పారదర్శకత కోసం పబ్లిసిటీ ఉండాలే కానీ ఓట్ల కోసం కాదని గుర్తిస్తే ప్రతి ఫథకం లక్ష్యాలను చేరుతుంది. 
After return from Davos, Singapore trips Chandra Babu get irritating with ministers and counters from media. Yesterday in a press meet reporter asked about Runa maffi. About Chandra anna sankrathri Kanuka he facing problems.