ముమ్మాటికీ కులరాజకీయమే

20 Jan 2016


           ఔను..ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నడుస్తోంది కులరాజకీయమే అని తాజా డెవలప్ మెంట్స్ ఋజువు చేస్తున్నాయ్.. అసలు చనిపోయిన విద్యార్ధి మనిషి అనే సంగతి మర్చిపోయి..అతను ఎస్సీనా..కాదా అంటూ వితండ వాదనను అడ్డగోలుగా తెరపైకి తీసుకురావడం దీన్నే తెలియజేస్తోంది..ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం రోహిత్ తండ్రి వడ్డెర..తల్లి ఎస్సీ..మాల..సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తల్లిదండ్రుల్లో ఏ కులం నిమ్నస్ధాయికి చెందినదో..ఆ కులాన్ని క్లెయిమ్ చేసుకునే హక్కు వారి సంతానానికి ఉంది..ఆ ప్రకారం రోహిత్ ఎస్సీనే..అయితే ఇప్పుడాయన బీసీనా..ఎస్సీనా కాదు అసలు సమస్య.. యూనివర్సిటీలో కులగజ్జి తట్టుకోలేక..సస్పెన్షన్ కు గురవడం..ఆత్మహత్యకు ఒడిగడితే..చేతనైతే ఆ పరిస్థితులను మార్చే ప్రయత్నం చేయాలి కానీ...అతను ఎస్సీ కాదు బీసీ..అంటూ అడ్డగోలు వాదన చేయడం పొలిటికల్ లీడర్లకు తప్పితే ఇంకెవరికీ చెల్లదు..ఇదే అంశాన్ని ఇవాళ వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రస్తావించారు.. హెచ్‌సీయూలో పీహెచ్‌డీ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ లేఖలు రాసిన కేంద్ర మంత్రులతో సహా ఉపకులపతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వర్శిటీ వ్యవహారంపై కేంద్రమంత్రి దత్తాత్రేయ లేఖ రాయడం పిచ్చుకపై బ్రహ్మాస్తం ప్రయోగించడమేనని చెప్పారు.. అందరూ కన్వీనెంట్ గా మర్చిపోయిన మరో విషయాన్ని ఎత్తిచూపారు జగన్..రోహిత్ తో పాటు సస్పెండైన మిగిలినవారిపై సస్పెన్షన్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు

HCU student Rohit suicide case taking another turn. It turn to cast politics. Actually his father belongs to BC community and his mother belongs to SC community.