ఇస్తే అడగను కదా..!

20 Jan 2016


           ఎన్టీఆర్ కు భారతరత్న..ఈ  స్లోగన్ వినీవినీ విసుగుపుడుతోంది..ఇప్పటికి ఇరవైఏళ్లుగా ఈ నినాదం తెలుగువారికి ప్రతీ ఏటా..రెండు మూడుసార్లు భజాయించి చెప్తుంటారు టిడిపి నేతలు..ఎన్టీఆర్ ఫ్యాన్స్..నిజంగా చిత్తశుధ్ది ఉంటే అనుకోవాలి కానీ..పైపై మాటలకు ఎందుకు ఊరిపోవాలి అని చాలామంది చంద్రబాబు అండ్ కో పై మండిపడుతుంటారు..ఇప్పుడు షరామామూలుగా అదే జరిగిందని సత్యం తెలిసినవాళ్లంటున్నారు..ఎన్టీఆర్ నిజంగా ఆయన చనిపోయిన రోజు మాత్రం కన్నుమూయాల్సింది కాదని..అంత త్వరగా ఆయన మరణం సంభవించేది కాదని ఎవరికైనా తెలుసు..ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపడంతో పాటు..పార్టీ ని లాక్కోవడంతోనే విపరీతమైన క్షోభ అనుభవించారని టిడిపివారే అంగీకరిస్తారు..సరే ఆ విషయం వదిలేస్తే..భారతరత్న అనే పురస్కారం ఎన్టీఆర్ కు దక్కాలని ప్రతి తెలుగువారూ కోరుకుంటారు..కానీ చంద్రబాబు మాత్రం కాదట..ఇది  ఇప్పటికి ప్రత్యర్ధి పార్టీనేతలు..వారి పత్రికలు లెక్కలేనన్ని సార్లు చెప్తుంటాయ్..నిజంగా ఆ పురస్కారం ఆయనకు లభించాలంటే ముందుగా కేంద్రప్రభుత్వానికి లేఖ రాయాలి..అలానే సిఫార్సులు చేయాలి..లాబీయింగ్ చేయాలి..మన ప్రభుత్వం తరపున ఇప్పటిదాకా ఆ ప్రయత్నం ఈ ఇరవైఏళ్లలో ఒక్కసారి కూడా జరగలేదు..అలాంటివి జరగకుండా..కేంద్రప్రభుత్వమే స్వయంగా ఆయనకు ఆ పురస్కారం ప్రకటించే అవకాశాలు మృగ్యం..ఐతే కొంతమంది వాదన ప్రకారం టిడిపి నేతల దగ్గర ఎన్టీఆర్ జపం చేయడానికి ఉన్న ఒకే ఒక అస్త్రం భారతరత్న..అదే నిజంగా లేఖ రాసి..లాబీయింగ్ చేసి..వచ్చేస్తే..ఆ పైన ఇక నేనిది చేయాలీ అని చెప్పుకోవడానికి ఏం ఉండదు..అందుకే వీళ్లిలా వేదికలపై డిమాండ్ చేస్తుంటారు..వేరే వారికి వస్తుంటాయ్..ఏళ్లు గడిచిపోతుంటాయ్..పురస్కారం దక్కాలనే డిమాండ్ మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుందని ఎద్దేవా చేస్తుంటారు.

TDP leaders are saying fighting for Bharatharatna to NTR. But they dont talk about remaining time. All telugu people are want to Bharatharatna to NTR, but CM Chandra Babu is never talk about it.