సెంచరీలు కొట్టే వయస్సు మాది

20 Jan 2016      అందరూ ఆలోచిస్తారు..కానీ బాలయ్య చేసేస్తారు..ఇదీ ఫ్యాన్స్ బాలకృష్ణ గురించి అనుకునేతీరు..అందుకు తగ్గట్లుగానే ఫాస్ట్ గా సినిమాలు చేసేస్తూ సెంచరీ మలుపు దగ్గర నిలబడ్డారాయన..తానెవరి కోసం ఆగనని..వందో సినిమా అని ప్రత్యేకంగా తనకేం లేదంటున్న బాలయ్య..ఫ్యాన్స్ కు మాత్రం అది స్పెషలే అని తేల్చారు..ఐతే  అందుకు ఎంచుకున్న కథాంశం..దానికి తన వారసుడు ఎంట్రీ గురించి ఓపెన్ చేసేసి మరో సెన్సేషన్ కి తెరతీశారు బాలకృష్ణ..బాలకృష్ణకు సెంటిమెంట్లు ఎక్కువ..ఇది అందరికీ తెలిసిన విషయమే..ఇప్పుడు అదే అంశం మరోసారి అందరికీ తెలియజేశారాయన.. వందో సినిమా ఆదిత్య 369కు సీక్వెల్ అంటూ ఎప్పట్నుంచో ఉన్న ఊహాగానాలు నిజం చేసేశారు..అఫీషియల్ గా డిక్లేర్ చేశారు.. అంతేకాదు..అందులో తన వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఉంటుందని చెప్పడంతో ఇప్పుడు ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు
      బాలకృష్ణ ఇప్పుడు ఆదిత్య ట్రిపుల్ నైన్ కు సింగీతం శ్రీనివాసరావ్ నే దర్శకుడిగా ఎనౌన్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది..వీరిద్దరి కాంబినేషన్ లో ఆదిత్య త్రీ సిక్స్ నైన్..భైరవద్వీపం..కృష్ణార్జున విజయం వచ్చాయ్..ఇందులో మొదటి రెండూ హిట్ కాగా..మూడోది ఫ్లాప్..సింగీతం శ్రీనివాసరావ్ కు ఇప్పుడు 85ఏళ్ల వయస్సు..ఆయన టాలెంట్ ను ఎవరూ శంకించరు గానీ..సింగీతంది అంతా క్లాసిక్ స్టైల్ అంటారు..బాలయ్య-సింగీతం ఫస్ట్ కాంబినేషన్ ఆదిత్య 369 కూడా క్లాస్ ప్రేక్షకులకు నచ్చడంతో పాటు..బాలకృష్ణకు ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా దగ్గర చేసిన సినిమా అది.. ఐతే ఇప్పుడు తరాలు మారాయ్..సింగీతం శైలిలో సినిమా వస్తే బాలయ్యబాబు అభిమానులు సంగతి పక్కనబెడితే యూత్ ఆడియెన్స్ ఏమాత్రం ఆదరిస్తారనేది సందేహంగా మారిందంటారు..ఐతే బాలకృష్ణ మాత్రం ఆయనకే ఓటేయడం దర్శకుడిని నమ్మితే ఎలా గౌరవిస్తారనే దానికి ఉదాహరణగా చెప్తున్నారు..అందుకే బాలయ్య ఇప్పుడు ఫ్యాన్స్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వందో సినిమాకు డైరక్టర్ గా ఎంచుకున్నాడంటారు..ఐతే కొంతమంది మాత్రం ఇది జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన విషయం అని తొందరపడొద్దని బాలయ్యకు సూచిస్తున్నారు..ఐతే బాలయ్య రూటే వేరు కదా..అందుకే తన సెంచరీ సినిమా కాంబినేషన్ ను అనౌన్స్ చేసి దటీజ్ డిక్టేటర్ అన్పించుకున్నారు.


These words are about Balakrishna but about his age, this is about his movie. Dictator is his 99th movie, after this movie he is very busy in selecting stories for hundred movie.