రజనీ ఎవడు అని బాలకృష్ణ ఎందుకన్నాడు?

13 Jan 2016


           తానిచ్చిన స్టేట్ మెంట్ ను తానే ఖండించేదెవరంటే అది ఒక్కమగాడికే సాధ్యమవుతుందంటారు ఇండస్ట్రీజనం..డిక్టేటర్ ప్రమోషన్ తో పాటు..ఈ మధ్య మీడియాతో పిచ్చాపాటీగా భేటీ అవుతున్న బాలకృష్ణ సాక్షి,డీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలు కలకలం రేపుతున్నాయ్..నాలాగా డూప్ లేకుండా ఎవరూ నటించరన్నా..నాకు ఇష్టం లేని వారిని అసలు క్షమించనన్నా అది ఆయనకే చెల్లిందంటారు ఫ్యాన్స్..ఐతే పాత్రల తాలుకూ ప్రవర్తన..ప్రభావం తనపై పడుకుండా ఉండటానికి దైవప్రార్ధనలో రోజూ 45 నిమిషాలు గడుపుతానని చెప్పాడు బాలయ్య..అహం చనిపోవడానికి ఇది ఎంతో సాయం చేస్తుందని బాలకృష్ణ ఒపీనియన్..మరి నాతో పెట్టుకుంటే ఎవరినీ క్షమించనని..చిన్న తప్పునైనా సహించను అనడం ఎలా కరక్టో ..అహం ఎలా చనిపోయినట్లో ఆయనే సెలవివ్వాలి మరి..ఈ ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు బాలయ్య..తానెవరినీ లెక్క చేయనని చెప్తూ..క్రీమ్ ఆఫ్ ఎయిటీస్ పేరుతో 1980లోని స్టార్లంతా కలుస్తుంటామని చెప్పాడు..ఓ సందర్భంలో తనని సుహాసిని కిందకు రజనీసార్ వచ్చారని పిలవగా..రజనీ ఎవడు..ఇక్కడంతా  ఒకటే ఎక్కువేంటి తక్కువేంటి అంటూ ఫోటో దిగిన తర్వాత కానీ కదల్లేదని చెప్పుకొచ్చాడు..దీనికి తోడు తన వారసుడు మోక్షజ్ఞ మంచి హీరోగా ఎదుగుతాడంటూ చెప్తూ..ప్రపంచాన్ని కాపాడే హీరోలా  ఎంట్రీ ఇవ్వడంటూ సెటైరేసాడు..ఇది ఎవరిని ఉద్దేశించి చేశాడో అందరికీ తెలిసిపోయింది కదా..! లేదా..ఐతే అతని పేరుతోనే అతని మొదటి సినిమా విడుదలైంది..ఊహించుకోండి..మీరే..!

Tollywood emotional hero Bala Krishna is slipped tang in an interview. Recently he is giving an interview for new paper, at that Rajani Kanth came to Balakrishna house. His called him Rajani Kanth came for you. Bala Krishna said who is Rajani Kanth.