కాపీలుక్?

23 Jan 2016


         సన్నాఫ్ సత్యమూర్తి,రేసుగుర్రం సినిమాల హీరో అల్లు అర్జున్..సరైనోడు సినిమా తీస్తున్నాడు..డైరక్టర్ బోయపాటి శ్రీనివాస్..లెజెండ్ తర్వాత బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుంది ఈ సినిమాకే..ఐతే ఫస్ట్ లుక్ కి ముందు ప్రీ లుక్ అంటూ ఓ ఫోటో విడుదల చేశాడు బన్నీ.. రిపబ్లిక్ డే రోజు ఫస్ట్ లుక్ అట..ఇప్పుడు ప్రీ లుక్ అని ఫేస్ బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేశాడు అర్జున్..ఐతే ఈలుక్ చూస్తే ఈ మధ్యే విడుదలై బంపర్ ఫ్లాపైన  ఓ సినిమా గుర్తొస్తుందని ఫ్యాన్స్ ఫీలింగ్..జావెలిన్ త్రో సైజు కంటే పెద్దదిగా కన్పిస్తున్న ఓ ఐరన్ బాల్ ను చేత్తో పట్టుకున్న ఓ యువకుడి ఫోటో ఈ ప్రీలుక్ లో ఉంది..ఇది చూడగానే ఎవరికైనా అఖిల్ సినిమా పోస్టర్ గుర్తుకురావడం కామన్..అందుకే ప్రీలుక్ కాదు కాపీ లుక్ అంటున్నారు..
         ఐతే దమ్ము,సింహా,లెజెండ్ సినిమాల్లో విలన్లను నరకడానికి హీరో చేతిలో ఓ ఆయుధం పెట్టిన బోయపాటి..ఈ సినిమాలో ఈ ఆయుధం పెట్టాడని కూడా టాక్.. లెజెండ్ ఆడియో ఫంక్షన్లో దేవీశ్రీ నే స్వయంగా బోయపాటి మాంచి ఇంగ్లీష్ సినిమా కాపీ క్యాట్ అని ఓపెన్ చేశాడు.అందుకే అదీ కాదు..ఇదీ కాదు..ఏదో హాలీవుడ్ మూవీ పోస్టర్ కాపీ కొట్టి ఉంటాడని మరి కొందరు గుసగుసలాడుతున్నారు. యమఫాస్ట్ గా షూటింగ్ చేసుకుంటున్న సరైనోడులో హీరోయిన్ గా  రకుల్ ప్రీత్‌సింగ్, కేథరిన్ థెస్రా నటిస్తున్నారు.

Allu Arjune got hatric hits with S/O Satymurthy. Now he is doing Sarinodu movie in the direction of Boyapati Srinu. Recently he posted a new pic in twitter and commented as new look. But it is the copy of recent movie.