రాజధానిలో రగడ

20 Jan 2016          ఏపీ కేపిటల్ ప్రాంతంలో మరోసారి రగడ చోటు చేసుకుంది.. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ల్యాండ్ పూలింగ్ ..మాస్టర్ ప్లాన్ పై అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది ప్రభుత్వం..ఐతే ఈ క్రమంలో కొన్ని చోట్ల వాగ్వాదం..తోపులాటలు సర్వసాధారణంగా మారాయ్.. తాజాగా ఉండవల్లి గ్రామంలో రైతులు సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ కు తమ నిరసన సెగ చూపించారు..మా గ్రామంలో రైతుల్లో 85శాతం ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా ఉంటే..ఇప్పుడీ అవగాహనా సదస్సులెందుకంటూ నిలదీశారు..

              తమ ఊళ్లలోంచి రోడ్లు వేస్తే సహించబోమంటూ రైతులు ఆగ్రహించారు..ఐతే ఈ దశలో సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయినవారికి రెట్టింపు జాగా ఇవ్వడంతో పాటు భారీగా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు..ఐనా సరే అవగాహన లేదు..ఆవకాయ్ లేదంటూ తెగేసి చెప్పడంతో చేసేదిలేక ఇక వెనక్కి తిరిగారు..ఐతే కొంతమంది మాత్రం ఎకరాకు రెండుకోట్లిస్తే ఆలోచిస్తామంటూ మెలిక పెట్టారు..ఈ రేటు కమిషనర్ ఇస్తారో ఇవ్వరో కానీ..మొత్తానికి ఆయనకు చుక్కలు చూపించారు రైతులు


AP Capital Amaravathi is always hot topic in news. Present AP government trying to explain master plan to Amaravathi people. Undavalli peoples gave counter to CRDA commissioner Srikanth Reddy, that they wont allow road through their village.