నమ్మండి ఏపికి స్పెషల్ హోదా వస్తుందట

23 Jan 2016


          ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సంగతి అందరూ పక్కన బెట్టేశారు..జనం కూడా దానిపై  ఆశలు వదిలేసుకున్నారు..ఎన్డీఏ,టిడిపి జోడు గుర్రాల స్వారీలో తమకి ఇక దక్కేది మట్టీ..నీళ్లేనని అర్ధం చేసుకున్నారు..ఐతే మంత్రులుగా ఉండి ఏదోక గొప్ప ప్రకటన చేయకపోతే సొంత మీడియా తప్ప వేరేవాళ్లు పట్టించుకోరనుకున్నారో ఏమో..వై సత్యనారాయణ ఉరఫ్ సుజనాచౌదరి..ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం తనకి ఉందన్నారు.. విభజన చట్టంలోని హామీలు అన్నీ వన్ బై వన్ పూర్తి చేస్తామని..కేంద్రం అదే పనిలో ఉందని చెప్పారు..  ప్రకాశం జిల్లా కనిగిరి వ్యవసాయ మార్కెట్‌ ఛైర్మన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన సందర్భంలో ఇలా సెలవిచ్చారాయన..ఓసారి బీహార్ ఎన్నికలు..ఓ సారి కాశ్మీర్ ఎన్నికలు..మరోసారి ఢిల్లీ ఎన్నికలు..ఇలా ఎప్పటికప్పుడు ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాలకు ప్యాకేజీలు ప్రకటించే మోడీ..ఏపీని మాత్రం గంగలో కలిపేశారని ఆరోపణలున్నాయ్.. పైగా ఈసీ కోడ్ తో హోదా పై ప్రకటన రాదని ఏపీ అధికార ప్రతినిధులు ఢిల్లీనుంచి ప్రకటనలు ఇస్తుంటారు..ఇప్పుడవేం అడ్డం లేదు..మరెందుకు రాదు..అని సగటు ప్రశ్న..సుజనా దగ్గర ఆన్సర్ ఉందా..?

AP people forgot about Special status, our leaders are also not talking about it. But today our honorable MP Sujana Chouday said defiantly AP will get special status, i have that confident.