బాబు నోట కూచిపూడి మాట

28 Jan 2016


                కూచిపూడి అభివృధ్దికి 120కోట్ల రూపాయల నిధులు కేటాయించామని ఏపి సిఎం చంద్రబాబునాయుడు ఘనంగా ప్రకటించారు. తిరుపతిలో నందినాటకోత్సవాల ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు కళలను కాపాడుకోవాల్సిన అవసరం గురించి చెప్పారు. ఐతే కళలను కాపాడుకోవడమంటే కేవలం కోట్లు గుమ్మరించడమేనా అనేది చర్చకు వస్తోంది. నాటకరంగకళలు, తోలుబొమ్మలాట, జానపదాలు ఇవన్నీ అంతరించిపోవడానికి సిధ్దంగా ఉన్నవే. మరి కూచిపూడికి 120కోట్లు కేటాయించామని చెప్పడం ఏంటో ఆయనేకెే తెలియాలి. అసలు ఈ కూచిపూడి నిధుల కేటాయింపు వెనుక పెద్ద భాగోతమే ఉఁదనుకోవాలి. 

             ఓ ఛానల్ కి    చంద్రబాబు కు ఉన్న అనుబందం గత ఐదేళ్లుగా కొనసాగుతోంది. ఆ టీవీలో బాలకృష్ణకు పెట్టుబడులు ఉన్నాయంటారు. ఆ ఛానల్ కార్యక్రమాల్లో చర్చలు చేపట్టినవారికి తెలుగుకు సంబంధించిన ఓ ఆట నిర్వహించినవారికి కేబినెట్ ర్యాంకులు కల్పించారు. కూచిబొట్ట ఆనంద్ అనే వ్యక్తికి అలానే కూచిపూడికి ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షులుగా చేయడం వెనుక మతలబూ అదే. కృష్ణాజిల్లాలో బోలెడంతమంది కళాకారులు ఆ గ్రామంలో ఉన్నారు. ప్రతి ఏటా జరిగే కూచిపూడి ఉత్సవాలకు వెళ్తే వారి గొప్పదనం బతుకులో పేదరికం తెలుస్తాయ్. వారందరికీ ఫించన్ కల్పిస్తే సరిపోదు. వారి సేవలను వినియోగించుకునేలా ప్రదర్శనలు, కళాశాలల ఏర్పాటు చేయాలి. అప్పుడే వారిలోని కళకు సార్ధకత లభిస్తుంది. అంతేగానీ వెయ్యి రూపాయల ఫించన్ తో వారి కళను వెలకట్టామనేది భ్రమ. ఇప్పుడు చంద్రబాబు చెప్తున్న 120కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారు, పెడుతున్నారు ఇదంతా అడిటింగ్ చేసి. ఎప్పటికప్పుడు వెబ్ సైట్ లో పెట్టాలి. అప్పుడే ఆ నిధులు సద్వినియోగం అయ్యాయని నమ్ముతారు. లేదంటే అవి కూాడ రాజకీయ నిరుద్యోగులకు పునరావాసం కల్పించడానికే అని అర్ధం చేసుకోవాల్సి వస్తుంది.
CM Chandra Babu granted 120cr fund to Kuchipudi dance. In Ap all fine arts are in the stage of ending but why CM gave fund to Kuchipudi, It is also a political drama of our CM.