ఎవరో పోరాడుతున్నారు..

7 Nov 2015

ఎవరో పోరాడుతున్నారు..
మోడువారుతున్న వృక్షాన్ని చిగురింపజేయాలని..
ఇంకెవరో మంటరగిలిస్తున్నారు అమాయక ప్రజల మధ్య..
మరెవరో వంత పాడుతున్నారు
నీతి,న్యాయం పోరాడుతుంటే 
గొర్రె కసాయి వాడిని ప్రాణం పోయేంతవరకూ నమ్నుతునే ఉంటుంది
కత్తి కసాయి వాడికి అమ్ముడుపోతూనే ఉంటుంది..
తరతరాల వారసత్వమైన
రౌడీయుజం..రాజ్యమేలుతునే ఉంటుంది
న్యాయం అణగదొక్కబడుతూనే ఉంటుంది
అన్యాయం..న్యాయం చావు పల్లకి మోస్తునే ఉంటుంది.. 
 - వైష్ణవి శ్రీ