దేహాలు వేరైనా ఆత్మ ఒక్కటే

24 Nov 2015


అవనికి అందం అలుమగల అనుబంధం
దేహాలు వేరైనా ఆత్మ ఒక్కటే
కలిమిలేముల కావడి కుండలు
బిడ్డల భవిష్యత్తుకు పునాదులు
వెలుగునీడల ఆశా కిరణాలు
మమతల మూటలకు చిరునామాలు
చిరు కోపతాపాలు సహజమే ప్రతి ఇంటా
పంతాలు వీడితే..పండంటి కాపురమౌతుంది
అహంకారం కన్నా మమకారం మిన్న
కొట్లాటకు దిగితే..పలు వికారాలకు దారితీస్తుంది
చేయి చేయి కలిపితే..సరిగమలెన్నో పలుకుతాయి
కష్టసుఖాలు పంచుకున్న వారికది కమ్మని కావ్యం
ఇష్టంగా మలచుకుంటే పూపరిమళాల పొదరిల్లు
అర్ధం చేసుకున్న వారికది మరో భగవద్గీత
ఆదర్శమయ్యేలా జీవించాలి మరో నలుగురికి     : వైష్ణవి శ్రీ