పొట్ట వస్తోందా..అయితే రాకుండా చేసుకోండిలా..

8 Nov 2015


పొట్ట వస్తోందా..అయితే రాకుండా చేసుకోండిలా..
భారతీయులకు మరీ ముఖ్యంగా దక్షిణాది వారికి 40 ఏళ్ళు దాటాయంటే పొట్ట వచ్చి పడుతుంది. వాకింగ్ , యోగా, ఎక్సర్ సైజులు చేసి నానా తంటాలు పడితే తప్ప ఆ పొట్ట కాస్తయినా తగ్గదు. ఉత్తరాది వారు గోధుమలను ఎక్కువగా వాడుతారు కాబట్టి మనతో పోల్చుకుంటే వారికి పొట్ట కాస్త తక్కువే. మనం రైస్ అధికంగా తినడం , బిర్యానీలు , స్పైసీ పదార్థాలు ఎక్కువగా తినడం ఊబకాయానికి ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.
పొట్ట రాకుండా చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. దాని కోసం పొట్ట తగ్గించుకునే ఆహార చిట్కాలను పాటించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అవేమిటంటే...........,
1.మసాలాలు ఎక్కువగా దట్టించిన నాన్ వెజ్ ఆహారాన్ని తగ్గించుకోవాలి.
2.ఆమ్లెట్లకు దూరంగా ఉండండి. ఉడికించిన కోడిగుడ్లు ఊబకాయాన్ని తగ్గిస్తాయి.
3.పచ్చి బటానీలు , పెసులు , మినుములు ఉడకబెట్టినవి తీసుకోవడం మంచిది.
4.పచ్చి కూరగాయలు కొవ్వును బాగా తగ్గిస్తాయి. క్యారెట్ , కాలీ ఫ్లవర్ , కీర దోస , పచ్చి కూరలు తీసుకోండి.
5.బార్లీ కొవ్వును బాగా కరిగిస్తుంది . బార్లీ జావ , బార్లీ నీళ్ళు ఊబకాయాన్ని దూరం చేస్తాయి.
6.గ్రీన్ టీ చక్కటి ఆరోగ్యానికి , నాజూకైన శరీరానికి ఎంతగానో పనికొస్తుంది. ఉదయాన్నే గ్రీన్ టీ తీసుకుంటే మీ శరీరం కొవ్వుకు దూరంగా ఉంటుంది.