అమరావతి రైతు కుటుంభాలకు సూచన

12 Nov 2015రైతన్నలు పది వేళ్ళు బిగిస్తేనే సకల జనులు ఐదు వేళ్ళతో ముద్ద నోట్లోకి వెళుతుంది (ముఖ్యమంత్రి దగ్గర నుండి అతి సామాన్యుడి వరకు). ఆంధ్ర రాష్ట్ర విభజన యుపీఏ ప్రభుత్వం నిర్ణయించిన పిదప ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటుంది అని శివరామకృష్ణయ్య కమిటిని నూతన రాజధాని నిర్మాణం కోసం తగు సూచనలు ఇవ్వమని కమిటి నియామకం జరిగింది... 

శివరామకృష్ణయ్య కమిటి రాష్ట్రంలోని 13 జిల్లాలలో విస్తృతంగా పర్యటించి పొందుపరచిన విషయాలు ఏమిటంటే అభివృధి అంశాలు అంటే పరిశ్రమలు హైదరాబాద్ లో వలె ఒకే చోట నెలకొల్పడం మంచిది కాదు అని రాష్ట్రంలో పరిశ్రమలు అన్ని జిల్లాలలో వ్యాపింప చేయాలి అని ఇక నూతన రాజధాని విజయవాడ గుంటూరు మధ్య ప్రాంతంలో కృష్ణానది ప్రవాహక ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు చేయడం మంచిది కాదు అని వక్కాణించారు. ఎందుకంటే ఈ ప్రాంతం భూకంపిత జోన్ నెంబర్ మూడు లోకి వస్తుంది అని ఇది ప్రమాదకరమైన ప్రదేశం అని అంతేకాక కృష్ణానది వరద ముంపుకు గురి అవుతుంది అని, సశ్యామలమైన వేల ఎకరాల భూమిని రాజధానికి వాడడం మంచిది కాదు అని అంతేకాకుండా ఈ భూములు నల్ల రేగడి మట్టితో (black cotton soil) ఉన్నదని ఈ ప్రదేశాలలో రెండతస్తుల కన్న నిర్మాణాలు చేపట్టడం ప్రమాదకరం అని సూచించడం అయినది... 
రాష్ట్ర విభజనాంతరం రైతులకు రుణమాఫీ ప్రకటించిన నారా చంద్రబాబు గారిని గెలిపించడం జరిగింది. చంద్రబాబుగారు ముఖ్యమంత్రి అయిన పిదప అమరావతి ప్రాంతాన్ని రాజధాని ఎన్నుకోవడం CRDA నియామకం చకచక జరగడం జరిగినధి. CRDA కమిటి లో శివరామకృష్ణయ్య కమిటి లో ఉన్నట్టువంటి నిపుణులు లేకుండా తెలుగుదేశం పెద్దలని నింపడం CRDA లో 110 జి.ఒ ని (అనగా CCDMA అనే ప్రభుత్వ, ప్రైవేటు కూడిన కార్పోరేషన్ నియామకం, ఈ CCDMA కి CRDA పరిధిలో ఉన్న భూములు CCDMA కార్పోరేషన్ వారి ఇష్టానుసారంగా 99 సంవత్సరాల వరకు లీజుకు కట్టబెట్టినది. అంటే రైతుల భూములు రాజధాని పేరుతో తీసుకొని ప్రభుత్వం తమకిష్టం వచ్చినట్టుగా ధారాదత్తం చేయడమే కదా. సశ్యామలమైన రైతుల పంట భూములను ప్రైవేటు రియల్ ఎస్టేట్ దారులకు అప్పగించడమే ఈ చర్య.)
తేవడం జరిగినది. 
సింగపూర్ మాస్టర్ ప్లాన్ తో ముడిపెట్టి సుమారు రెండు లక్షల ఎకరాల పంట భూములను కైవసం చేసుకోవడానికి యోచన. ఇప్పటికి రైతులను భయభ్రాంతులను చేసి పూలింగ్ అనే విధానంతోముప్పై మూడు వేల ఎకరాల పంట పొలాలను లాక్కోవడం జరిగినధి. అంతేకాకుండా పక్కనే ఉన్నఅటవీ ప్రాంతంలో యాబై మూడు వేల ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. అంటే రైతుల భూములు ముప్పై మూడు వేల ఎకరాలు, అటవీ ప్రాంతంలో యాబై మూడు వేల ఎకరాలు వెరసి ఎనబై ఆరు వేల ఎకరాలు. ఇంకా లక్ష ఎకరాలు పైచిలుకు భూములను కైవసం చేసుకోవడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. రైతన్నలారా ఒకేఒకసారి రెండులక్షల ఎకరాల సశ్యామలమైన పంట భూములను రాజధాని నిర్మాణం పేరుతో ధ్వంసం చేస్తే ఆహార భద్రతకు ఎంత లోటో ఆలోచించండి. రెండు లక్షల ఎకరాల పంట భూములు ద్వంసమైతే అందులో పనిచేసే రైతు కూలీల పరిస్థితి ఏమిటి??
ఇక రైతులు ఫూలింగ్ కు ఇచ్చిన పరిస్థితులు ఏమిటో గమనిద్దాం ఒకసారి : ఫూలింగ్ కు ఇస్తే ఎకరమునకు పద్నాలుగు వందల గజాల స్థలం ఇస్తాము అని, రాజధాని కట్టిన తరువాత గజం భూమి లక్ష రూపాయలు పైచిలుకు ఇస్తాము అని ప్రభుత్వం నమ్మబలికింది. అంటే పద్నాలుగు వందల గజాల భూమి విలువ పద్నాలుగు కోట్లు అన్నమాట కాని ఈ స్థలం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఇస్తారు అని రాత పూర్వకముగా ఎక్కడ పదిలపరచలేదు 
గవర్నమేంట్ సేకరించనున్న రెండు లక్షల ఎకరాలలో రైతులకి ఇవ్వవలిసింది యాబై తొమ్మిది వేల ఎకరాలు. ఇక మిగిలింది లక్ష నలబై ఒకటి ఎకరాలు 
ఇందులో అడ్మిన్ స్ట్రెటివ్ కాపిటల్ వేయి ఎకరాలలో కడితే మిగిలిన లక్షా నలబై వేల ఎకరాలు సింగపూర్ కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. సింగపూర్ కంపెనీ వారు ఈ లక్షా నలబై వేల ఎకరాలలో గేటెడ్ కమ్యూనిటీ ని నిర్మిస్తారు అందులో విలాసవంతమైన అపార్ట్మెంట్స్ భోగ భాగ్యములతో విరసిల్లె విల్లాలు (విలాస భవంతులు), పబ్స్, నైట్ క్లబులు, కాసినోలు(జూద గృహాలు) అంతే గాక వేశ్యా గృహాలు నిర్మించిన హాస్యం కాదు. 
లక్షా నలబై వేల ఎకరాలలో నిర్మించబడిన అతిపెద్ద టౌన్ షిప్ లో ధనవంతులు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక రైతులకు ఒక మూల కేటాయించిన భూములలో ప్లాట్లను ఎవరు కొనుగోలు చేస్తారు? ఎందుకంటే సింగపూర్ వారు కట్టే గేటెడ్ కమ్యూనిటీ లో కొనేటప్పటికే కొనే శక్తీ హరించుకుపోతుంది ఇక రైతుల ప్లాట్లను 500 రూపాయిలకు కూడా కొనే శక్తీ ఉండదు. ఇక రాజధాని నిర్మాణమే యాబై సంవత్సరాలకి గాని పూర్తి కాదు. అప్పటిదాకా రైతులు ఏమి చేయాలి?
పండలనేని శ్రీమన్నారాయణ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో మనందరికీ విదితమే. అక్టోబర్ 10న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు రాష్ట్ర ప్రభుత్వం పై స్టే విదించడం అయినది. స్టే ఉత్తర్వులలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన కట్టడాలు చేయరాదని అంతేకాక పొలాల హద్దులను చేరపరాదని కనీసం భూమిని చదును కూడా చేయకూడదు అని ఉత్తర్వులు జారి చేయడం అయినది అయినా ప్రభుత్వం వారు ట్రిబునేల్ ఉత్తర్వులు లెక్క చేయకుండా పనులు వేగవంతం చేసింది. సదరు శ్రీమన్నారాయణ అక్టోబర్ 16న రాష్ట్ర ప్రభుత్వం వారు అమరావతిలో చేసే పనులను సాక్ష్యాధారాలతో చూపగా ట్రిబ్యునల్ వారు స్పందించి గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి మరియు CRDA కమిషనర్ గారికి పనులు నిలిపివేయాలి అని నోటిసులు జారి చేసింది.
అయినా రాష్ట్ర ప్రభుత్వం, ట్రిబ్యునల్ వారి యొక్క ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ హెలిపాడ్ నిర్మాణం, రోడ్ల నిర్మాణం సభాస్థలికి సుమారు 150 ఎకరాలలో పంటను ద్వంసం చేసి భూమిని చదును చేయడం జరిగింది. నవంబర్ 5న పండలనేని శ్రీమన్నారాయణ CONTEMPT పిటిషన్ వేయగా ట్రిబ్యునల్ వారు సదరు CONTEMPT ను స్వీకరింఛి రాష్ట్ర ప్రభుత్వానికి నోటిసులు జారి చేయడం అయినది. నవంబర్ 19న ఈ పిటిషన్ పై వాదోపవాదాలు జరగనున్నవి. 
రెండు లక్షల సశ్యామలమైన సుమారు 120 రకాల పంటలు సాలీనా మూడు పంటలు అందించే భూములను ద్వంసం చేస్తే ఆహారభద్రతకు పూడ్చలేని విఘాతం జరుగుతుంది. భావితరాలకు ఆహార సమస్య తప్పకుండా తలెత్తుతుంది. పంట పొలాలకు భద్రత ఉండదు. కాబట్టి మనందరం ఈ భూసేకరణను ప్రతిఘటించి మన బంగారు భూమిని రక్షించుకుందాం

credits : Pandalaneni Srimannarayana