రౌడీయుజం రాజ్యమేలుతుంటే, నెత్తురోడుతోంది సీమాంధ్ర

7 Nov 2015

రౌడీయుజం రాజ్యమేలుతుంటే, నెత్తురోడుతోంది సీమాంధ్ర
గట్టుతెగిన గోదారై రోదిస్తోంది సీమాంధ్ర
ఒడ్డునుండి విడ్డూరం చూస్తున్న దద్దమ్మలను చూడలేక
పోరాడుతోంది ప్రాణాలొడ్డి సీమాంధ్రా..
నీతి, న్యాయం కరుడుగట్టి మత వ్యామోహాలు ప్రబలుతుంటేను..
మోహం మత్తుకు కొరడా ఝుళిపింది సిమాంధ్రా
అడుగడుగునా చెలరేగే విధ్వంసాలకు తలవంచలేక
అమ్మపాలు తాగిన గర్వంగా రొమ్ము విరిచింది సిమాంధ్రా
డబ్బుకు గడ్డితినే గబ్బునాయకుల జూసి
ఫెళఫెళ పళ్ళు కొరికి పదపదమంటూ..విప్లవానికి నాంది పలికింది సీమాంధ్ర..
అమ్మపాలు తాగినోడు అవివీతికి తలవంచడెన్నడు
రొమ్ము విరిచి నిలబడతాడు..చెయ్యెత్తి జైకొట్టు సీమాంధ్ర  - వైష్ణవి శ్రీ