నాడు వలచిన ప్రియురాలు నేడు పలచబడిందా...

8 Nov 2015నాడు కుందనపుబొమ్మ వన్నావు
కందిరీగ నడుమన్నావు 
కనుదోయి కనులన్నావు
చిలక పలుకులన్నావు
అలకల కులుకులన్నావు
కోకిల గానమన్నావు..
నేడు...పిలిచిన పలకవు ఉలకవు
పక్కకొస్తే తప్పుకుంటావు
పలకరిస్తే..విసుక్కుంటావు
కిలకిల నవ్వులను..కాకి గోలంటావు
కలతలను మిగుల్చుతావు
నాడు వలచిన ప్రియురాలు
నేడు పలచబడిందా...

                                      వైష్ణవి శ్రీ