బీహార్ లో ఎన్ డీ ఏ ఓటమి కి ...

9 Nov 2015ఒక భారతీయుడు గా :
దేశానికి మంచిది కాదు. ఈ యాదవ్ లూ, సోనియాలూ దేశానికి అరిష్టం. ఇప్పుడిప్పుడే గాడి లో పడుతున్న దేశ స్థితి మళ్ళీ అనిశ్చితం అవ్వచ్చు !
రాజ్య సభ లో సంఖ్యా బలం పెరగాల్సిన స్థితి లో రాష్ట్రాల్లో ఇలా ఓడిపోవటం బీ జె పీ కి మంచిది కాదు !
ఇకమీద అయినా మోడీ - షా ద్వయం అతిగా తమను ఊహించుకోకుండా అందరినీ కలుపుకుని పోవడం మంచిది !
ఒక ఆంధ్రుడిగా :
బీ జె పీ కి గుణపాఠం చెప్పి బిహార్ ప్రజలు ఆంధ్ర వాళ్లకు మిత్రులయ్యారు. ఇకనైనా కేంద్రం ఆంధ్ర కోసం ఏమైనా చేస్తారని ఆశిస్తున్నా.
బీ జె పీ ఓటమి ఆంధ్ర బీ జె పీ నాయకుల కాళ్ళు నేలపై రావడానికి సాయపడింది . ఇకమీద అనవసరం గా బాబు ప్రభుత్వాన్ని విమర్శించడం `మాని ఒక మంచి మిత్ర పక్షం గా రాష్ర అభివృద్ధి కి సాయపడాలి.
ఎంత కాదన్నా ఆంధ్ర అభివృద్ధి లో చంద్ర బాబు చరిస్మా, పనితనం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అన్న విషయం మోడీ మరవరాదు.
భవిష్యత్ లో జగన్ తో జత కట్టే చెత్త ఆలోచన ఇకపై బీ జె పీ చెయ్యదని ఆశిస్తున్నా !
చివరిగా బీహార్ లో ఎన్ డీ ఎ ఓటమి - 70 % ఖేదం , 30 % మోదం !!

                                                                                                        : Veeru Golla