ఓ మహాత్మా.. సత్యమన్నావు..

7 Nov 2015


ఓ మహాత్మా..
సత్యమన్నావు 
సత్యాగ్రహమన్నావు
శాంతి శాంతి అన్నావు
నేడు ఎక్కడయ్యా శాంతి
ఖరీదు పెడదామన్నా పంటే కరువయ్యింది
మీ విగ్రహాలు తప్ప నిగ్రహాలు మచ్చుకైనా కానరాక రక్త సంబంధాలే ముక్కలైపోతున్నాయి
మంచి దస్తూరి వ్యక్తిత్వానికి నిదర్శనమన్నావు..
నేడు విస్తుపోతున్నాం
వంకర టింకర మనసులను చూడలేక
మంచి పుస్తకాన్ని మూలకు విసిరిపారేసి
మట్టిలో కలసిపోయే తుచ్ఛమైన శరీరానికి వేలకు వేలు వెచ్చిస్తున్నాము
ఎక్కడయ్యా నీ బోధనలు మచ్చుకైనా కానరావాయే
సత్యాగ్రహానికి ముగింపు పలికి నిత్యాగ్రహానికి నాంది పలుకుతూ
బాంబుల వాన కురిపిస్తున్నారు
నరజాతి మొత్తం కులమతాల పాలన పరాయణత్వంలో మగ్గిపోతున్నది
హరితవిప్లవం వికటాట్టహాసం చేస్తున్నది
రైతన్నల పాలిట ఘోరకలిని చూడలేక
అకృత్యాలన్నీ చూసి తట్టుకోలేవనేమో గాడ్సే చేతుల్లో మరలిరాని లోకానికి తరలి వెళ్ళి
గాడ్ ఫాదర్ వయ్యావు..
నేడు కావలసింది గాంధీలు కాదయ్యా..గాడ్సేలు.. 
- వైష్ణవి శ్రీ