మహకూటమి గెలుపుతో కాంగ్రెస్, బిజేపీ యేతర రాజకీయ కూటమి ఏర్పాటు

8 Nov 2015మహకూటమి గెలుపుతో కాంగ్రెస్, బిజేపీ యేతర రాజకీయ కూటమి ఏర్పాటుకు మార్గం.

బిహర్ ఎన్నికల పలితాలు ఎగ్జిట్ పలితాలను తారుమారు చేస్తూ నితీస్ నాయకత్వం లోని మహకూటమి విజయం సాదించింది. ఈ ఎన్నికల పలితాలు దేశ రాజకీయాలలో పెనుమార్పులకు ఆస్కారం కల్పిస్తున్నాయి. బిజేపి నాయకత్వంలోని కేంద్రం పై ప్రజలలో మెల్లగా ఎర్పడుతున్న అసంతృప్తికి ప్రత్యామ్నాయంగా కాంగ్రస్ స్దానంలో ప్రాంతీయ పార్టీలు పుంజుకొంటున్నాయి. మొన్న డిల్లీ, నిన్న కేరళా, నేడు బిహర్ వరుసగా బిజేపి, కాంగ్రస్ పార్టీలు కాకుండా ప్రాంతీయ పార్టీలు గెలవడంతో 2019 సార్వత్రిక ఎన్నకల నాటికి ఈ పార్టీలు జాతీయ పార్టీలకు ప్రత్యమ్నాయంగా అవతరించనున్నాయి.


సహజంగా 10 సంవత్సరాల పాలన సాగిస్తే కచ్చితంగా వ్యతిరేక పవనాలు వీస్తాయి. అందుకు బిన్నంగా నితీస్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడం విశేషం. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒక్కటి నితీస్ పై నమ్మకం రెండు బిజేపి కి కొంత వ్యతిరేకంగా ప్రజల ఆలోచన గా కనిపిస్తుంది. 2014 సార్వత్రిక ఎన్నకల ఒటమి కారణంగా కొన్నినెలలు మినహ 10 సంవత్సరాలు నితీస్ పాలన సాగింది. అంతకు మునుపు బీహర్ అంటే అవినీతి, అరాచక పాలనకు కేంద్రంగా ఉన్నది. నితీస్ రాకతో అనుహ్యమార్పులు తీసుకొచ్చారు. మంచి పరిపాలనా దక్ష్యుడు గా నిలబడ్డారు. అబివృద్ది విషయంలో కూడా చెప్పుకోదగ్గ ప్రగతి సాదించారు. స్దూలంగా ప్రజల విస్వాసాన్ని చూరగొన్నారు.

డిల్లీ పలితాలు తర్వాత బిజేపి పాటాలు నేర్చుకోలేదనిపిస్తుంది. 2014 బిజేపి గేలుపును వారు సరిగా విశ్లేన చేసుకోలేదనిపిస్తుంది. కేవలం మోది గాలి వల్లే అనూహ్య విజయంగా బావించడమే పొరబాటు. నాటి ఎన్నికల నాటికి కేంద్రంలోని కాంగ్రేస్ అస్దవ్యస్ద పాలనపై దేశ ప్రజలు విసిగిపోయారు. వారికి ప్రత్యామ్నాయంగా జాతీయంగా ప్రాంతీయపార్టీలు నిలబడలేదు. చివరికి ప్రయత్నం కూడా చేయలేదు. వామపక్షాలు దాదాపు పోటిలో ఉన్నాయా లేదా అన్నపరిస్దితి. ఈ పరిణామం బిజేపికి కలిసి వచ్చింది. మోది అప్పటికే విజయవంతమైన పాలకునిగా దేశం ముందు ఉన్నారు. ఇన్ని సానుకూల పరిణామాల నడుమ బిజేపి విజయం సాదించింది.

డిల్లీ లోక్ సబ ఎన్నికలలో కెజ్రివాల్ ని ఓడించి తర్వాత జరిగిన అసంబ్లీ ఎన్నికలలో వారికి ప్రజలు పట్టం కట్టినపుడే బిజేపికి ఈ విషయం బోదపడి ఉండాలి. అదే పలితాలు ఇప్పడు బిహర్ లో పునారావృతం అయింది. 20 నెలల బిజేపి పాలనలో అనేక ఆశలతో అదికారం లోకి మోదిని తీసుకొచ్చినా పెద్దప్రయోజం లేదు అన్న బావన సాదారణ ప్రజలది. మోది మార్క్ పాలన కేవలం బావన లో తప్ప ప్రజల నిజ జీవితంలో కనిపించడంలేదు. ఇప్పటికైనా మించి పోయింది లేదు ఈ ఎన్నకల పలితాలు బిజేపికి మంచి అవాకాశం ఎందుకంటే ఇంకా 40 నెలల పాలన ఉంది సరి అయిన విశ్లేషన చేసుకుని సగటు ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా పాలనా విదానాలు ఉంటే వారికి దేశానికి మంచిది.

ఈ పలితాలు దేశరాజకీయాలలో పెనుమార్పులకు దారితీయనున్నాయి. బిజేపి క్రమేనా ప్రజలకు దూరమౌతుంటే ఆ మేరకు కాంగ్రేస్ దగ్గర కావడంలేదు. ఈ స్దానంలో ప్రాంతీయపార్టీలు పుంజుకుంటున్నాయి. ఏపిలో బాబు లేదా జగన్, తమిళనాడు లో జయ లేదా కరుణానిది, ఒరిస్సాలో నవీన్, బెంగాల్ లో మమతా, కేరళ లో వామపక్షాలు, ఉత్తరప్రదేశ్ లో ములాయాం లేదా మాయావతి, డిల్లీలో కెజ్రీవాల్, మహరాష్ట్రలో శరద్ లేదా శివసేనాలు పుంజుకుంటాయి. ఎలాగూ తెలంగాణ లో బిజేపికి అవకాశం ఉండదు తెరాసా బలంగానే ఉంది. వీరందరికి నితీస్ నాయకుడిగా ముందుకు రావడం తద్యం.  - 
Purushotham Reddy Makireddy