భారతీయత గెలిచింది

8 Nov 2015


భారతీయత గెలిచింది. మతాన్ని, రాజకీయాన్ని కలపవద్దని, అభివృద్ధి చూసి ఓటేస్తాం అని నిరూపించిన బీహార్ ప్రజలకు అభినందనలు.
మోడీ గారు, మీకు ఇంకా సమయముంది, ఈ బీహార్ ఓటమి వల్ల మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రజలు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని పాడు చెయ్యకండి. ప్రజల అవసరాలు గుర్తెరగండి, ఎన్నికల ముందు మనమందరం ఏ సమస్యల మీద చర్చించామో ఆ సమస్యల మీద దృష్టి పెట్టండి. నెహ్రు పేరు తుడిచెయ్యాలనే ప్రయత్నం కన్నా, మరో నెహ్రు అవ్వటానికి ప్రయత్నం చెయ్యండి, చరిత్రలో ఒక మంచి నాయకుడిగా నిలవండి.
                                                                                                                            : Ramesh adusumalli