టాలీవుడ్ లో లక్ష్మీ వేట

14 Nov 2015

మన పండుగల్లో దీపావళి అంటే ఓ లెక్క ఉంది. వర్షాకాలం వెళ్లిపోయి.. శీతాకాలం వచ్చేందుకు దీపావళికి నాంది అన్నమాట. అంటే దీపావళితో చలి మొదలైపోయేది ఇక్కడి నుంచే. ఈ విషయాన్ని బాగా అర్ధం చేసుకున్నట్లుంది సర్దార్ గబ్బర్ సింగ్ ఐటెం గాళ్ లక్ష్మీరాయ్. అభిమానుల్లో వేడి పుట్టించడానికి కొత్త స్కెచ్ వేసింది ఈ ఐటెం సుందరి. పండుగ పేరు చెప్పి ఓ మాంచి హాట్ ఫోజును రిలీజ్ చేసేసింది. సాధారణంగా ఇలా ఫెస్టివల్ విషెస్‌ని సాంప్రదాయమైన దుస్తుల్లో.. ఒద్దికగా పొందిగ్గా పోజులిస్తారు. కానీ లక్ష్మీరాయ్ ఇప్పుడు ఐటెం భామ అవతారం ఎత్తింది కదా. అందుకే తన స్టయిల్లో రెచ్చిపోయింది. అయితే.. అందం తప్ప.. అసభ్యత లేకుండా ఉన్న ఈ పోజులు మాత్రం భలే క్యాచీగా ఉన్నాయి.

కాంచనలాంటి సినిమాతో టాలీవుడ్‌లో మంచి పేరు అయితే వచ్చింది కానీ.. ఛాన్సులు మాత్రం రాలేదు రాయ్ లక్ష్మీకి. రాకరాక ఇప్పుడ సర్దార్ పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ట్యాలెంట్ అంతా చూపించేస్తానంటోంది ఈ సుందరి. దీనికి తోడు కేవలం ఓ ఐటెం పాటకే పరిమితం కాకుండా.. కొన్ని ఇంపార్టెన్స్ సీన్స్ లోనూ తళుకున్నమనబోతోంది రాయ్ లక్ష్మీ. పెర్ఫామెన్స్ విషయంలోనూ ఈ హీరోయిన్ కి మంచి పేరే ఉంది. దీన్ని నిలబెట్టుకుని టాలీవుడ్‌లో జెండా పాతేసేందుకు గట్టిగానే ఫిక్స్ అయింది. అందులే భాగంగానే అందరికీ దగ్గరయ్యేందుకే ఈ గ్లామర్ పోజు.