కాజల్ కు కాలోచ్చింది

9 Nov 2015


ఒకప్పుడు వరుసగా ఏ మాత్రం గ్యాప్ లేకుండా స్టార్ హీరోస్‌తో సినిమాలు చేసిన అందాల భామ కాజల్ అగర్వాల్ ఈ మధ్య కాస్త స్లోగా సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది టెంపర్‌తో హిట్ అందుకున్న ఈ భామ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌కి సైన్ చేసింది. అవే పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ బాబు బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం మూవీని పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ మొదలై చాలా రోజులైంది. చిన్న చిన్న షెడ్యూల్స్ చాలానే ఫినిష్ చేసారు. ప్రస్తుతం లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో పవన్‌తో పాటు ఇతర నటీనటులపై వచ్చే సీన్స్‌ని షూట్ చేస్తున్నారు. ఇంత జరిగినా ఇప్పటికీ కాజల్ అగర్వాల్ సర్దార్ సెట్లో అడుగుపెట్టలేదు. ఫైనల్ గా ఈ చిత్ర టీం కాజల్ కి సర్దార్ షూటింగ్ డేట్ ని ఫైనలైజ్ చేసారు.

సర్దార్ టీం హైదరబాద్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నాక నవంబర్ 17 నుంచి ఓ మేజర్ షెడ్యూల్‌ని గుజరాత్‌లోని వడదొరలో స్టార్ట్ చేస్తారు. ఈ షెడ్యూల్ నుంచి సర్దార్ షూట్‌లో జాయిన్ అవ్వమని కాజల్‌కి పిలుపొచ్చింది. దీంతో కాజల్ అగర్వాల్ కూడా ఆ డేట్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది. కాజల్ అగర్వాల్ మొదటిసారి పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఈ సినిమాలో రాయ్‌లక్ష్మీ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. గుజరాత్ షెడ్యూల్ తర్వాత ఓ మేజర్ షెడ్యూల్ కోసం రాజస్థాన్ వెళ్లనున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శరత్ మరార్ డైరెక్టర్. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.