సామాన్యుడిపై సర్కార్ శటగోపం

14 Nov 2015


హెల్మెట్ పేరుతో సామాన్యుడిపై సర్కార్ శతగోపం
హెల్మెట్ దరించక పోతే జరిమాన విదిస్తాం మీ శ్రేయస్సు కోసమే ఈ సెస్సు అని చెబుతు మొన్న ఒక్క రోజులోనే ఒక్క లక్షా యాబై వేలు జరిమానాగా వసూలు చేసారు....!!
నిజంగా ప్రజా శ్రేయస్సు కోరే వారే ఐతే మొదట ప్రభుత్వం వారు మద్యాన్ని నిషేదించాలి...!!
ఆ మద్యం మత్తులో వాహనాలు నడిపి అనంతలోకాలకు వెలుతున్నారు...!!
ఇలాంటి వారికి హెల్మెట్ వున్న "నిషా"ప్రయోజనం ...!!
అదే మద్యం సేవించని వాల్లు హెల్మెట్‌ లేకున్నా అదికశాతం వాల్లు సురక్షితంగా ఇల్లకు చేరతారు...!!
కాని మన ప్రభుత్వం వారు వారి ఆదీనంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి మరీ ప్రమాదాలు పెరిగేలా చేస్తూ ప్రజా శ్రేయస్సు అంటు కపట ప్రేమతో హెల్మేట్‌ పేరున ప్రజలపై జరిమానల విదిస్తున్నారు...!!
నిజమే సామాన్యుడిపై జరిమానాలు మరియు పన్నుల రూపంలో బారంమోపి ఖజానాకి నిధులు చేకూర్చకపోతే అది ఇది అని సాద్యమైన హామిలు అన్ని ఇచ్చేసారు అవి అన్ని ఎలా నిలబెట్టుకుంటారు...! ఇలా బెల్టు తీసీ బెండుతీసేలా బాదితేనే సాద్యం.
ఇకనైన గ్రహించండి సామాన్యప్రజలారా తప్పుడు హామీలు నమ్మి ఓట్లు వేసి రోట్లో తలపెట్టుకోకండి.
గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది నొప్పేంటో గుడ్డుకి ఏమి తెలుస్తుంది అన్నట్లు...!!
రోజు హెల్మేట్‌ మోసే వారికి తెలుస్తుంది అది లేక జరిమాన కట్టే వారికి తెలుస్తుంది బాదేంటో...!!
ఈ జరిమానాలు విదించాలి ఆదాయం రాబట్టాలి అనుకునే వారు కార్లలో తిరుగుతారు కధ సామాన్యుల వెతలు వారికి తెలియవు....!!
NOTE : హెల్మెట్‌ ప్రమాధం నుంచి రక్షిస్తుంది కానీ
చిన్న చిన్న ఊర్లలో పట్టణ సందుల్లో తిరిగే వాల్లకు కాకుండా ...!! జాతీయ రహదారులపై వెళ్ళే వారికి దూర ప్రయాణం చేసే వారికి తప్పనిసరి అనే విధానం పెట్టాలి కాని ప్రతీ సామాన్యులపైన ఈ విధానాన్ని అమలు చేసి అసహనానికి గురిచేయోద్దు అని మనవి...!! హెల్మెట్‌ కన్నా ప్రమాదకరమైన మద్యం పై సర్కార్‌ దృష్టి పెట్టాలి అని ఆకాంక్షిస్తున్నాం_/|\_