ప్రేమలో నయన్ సక్సెస్?

9 Nov 2015


30 ప్లస్ లో యమ స్పీడు మీద దూసుకెళ్తోంది నయన్ రాకెట్. వరుసగా మూడు నెలల్లో మూడు సూపర్ హిట్లు కొట్టేసిందీ భామ. జయం రవి సరసన నయన్ నటించిన తనీ ఒరువన్ ఆగస్టులో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఆ సినిమాతో నయన్‌కు కూడా మంచి పేరే వచ్చింది. ఆ తర్వాతి నెలలో నయన్ లీడ్ రోల్ చేసిన మయూరి కూడా సూపర్ హిట్టే. అందులోనూ నయన్ పెర్ఫామెన్స్ అదుర్స్ అన్న ప్రశంసలు వినిపించాయి. ఇక తాజాగా అక్టోబరులోనూ ఓ హిట్టిచ్చేసింది నయన్. విజయ్ సేతుపతి సరసన ఆమె నటించిన నానుమ్ రౌడీ దా ఈ బుధవారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమాను ధనుష్ నిర్మించగా.. నయనతార కొత్త ప్రియుడిగా ప్రచారంలోకి వచ్చిన విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించడం విశేషం. 

నయన్, విఘ్నేశ్ ల మధ్య ప్రేమ వ్యవహారం ముందు ఉత్తుత్తిదే అన్నారు కానీ.. ఈ సినిమాలో నటించిన పార్తీబన్ ఓ ఇంటర్వ్యూలో వాళ్లిద్దరూ ప్రేమ పక్షులే అన్నట్లు మాట్లాడ్డాన్ని బట్టి వ్యవహారం సీరియస్సే అనుకోవాల్సి వస్తోంది. నానుమ్ రౌడీ దా హిట్టవడంతో విఘ్నేశ్ క్రేజీ డైరెక్టర్లలో ఒకడిగా మారిన నేపథ్యంలో నయన్ తో అతడి పెళ్లయ్యే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయంటున్నారు. ఇంతకుముందు నయన్.. వల్లభ చేస్తుండగా శింబుతో, విల్లు చేస్తుండగా ప్రభుదేవాతో ప్రేమలో పడింది. ఆ సినిమాలు రెండూ ఫ్లాపయ్యాయి. అలాగే వారితో ప్రేమ కూడా ఫెయిలైంది. ఐతే ఇప్పుడు విఘ్నేశ్ తో ప్రేమాయణం నడిపిన సినిమా నానుమ్ రౌడీ దా హిట్టయిన నేపథ్యంలో ఆమె ప్రేమ కూడా సక్సెస్ అయి.. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని అంటున్నారు కోలీవుడ్ జనాలు. నయన్ కెరీర్ యమ స్పీడు మీదున్న నేపథ్యంలో పెళ్లి కొంచెం లేటైతే అవ్వొచ్చు కానీ.. విఘ్నేశ్, ఆమె ఒక్కటయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి.