బాబు గారు మీ నిర్ణయం మార్చుకోండి

14 Nov 2015
దొంగలు దొంగలు ఊల్లు పంచుకున్నారు అనేది ఒక నాటి మాట...!!
రాజకీయనాయకులు రాజకీయనాయకులు కొండలు గుట్టలు మింగేస్తున్నారు...!! నేటి మాట
వాల్లు దోచేసారు దోచేసారు అని ప్రత్యర్ధుల మీద ఆరోపణలు చేస్తూ అదికారంలోకి వచ్చి వీళ్ళు చేస్తున్నది ఏమిటి...!!
మొన్న : అబివృద్ది పేరుతో 30 వేల ఎకరాల పంట భూముల రియల్‌ వ్యాపరం...!!గుంటూర్‌
నిన్న : ఎయిర్‌ పోర్ట్‌ పేరుతో 13 వేల ఎకరాల రైతుల భూముల శ్వాహా...!! విజయనగరం
నేడు : పచ్చని గిరిజనుల అమ్మ ఒడి విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకం...!! విశాఖ (అరకు)
ఎలక్షన్‌ ముందు భాక్సైట్‌ తవ్వకానికి గత ప్రభుత్వం మొగ్గు చూపితే ప్రతి పక్షంలో వుండి వ్యతిరేకించారు అది చూసి గిరిజనులు దయగల బాబుకి మా పైన ప్రేమ అనుకున్నారు...!!
ఎలక్షన్‌ తరువాత రాష్ట్ర ఆదాయానికి అబివృద్దికి అంటు విశాఖమన్యాన్ని గిరిజనుల కన్నీటి సాక్షిగా భూస్తాపితం చేయాలి చూస్తున్నారు...!!
ఆ రోజు గిరిజనులు దయగల బాబు అనుకున్నారు...!! ఈ రోజు వాస్తవాన్ని అర్ధం చేసుకుంటున్నారు వారు తవ్వుకోకుండా మరేవరో తవ్వుకోవడం ఇష్టం లేక గాని మాపై జాలితో అడ్డు పడలేదు అని....!!
నమ్మకం వున్న ప్రతీ చోట ఈ పోట్లు తప్పవ అభం శుభం తెలియని అమాయాకపు బ్రతుకులు ఆ గిరిజనులవి..!! వాళ్ళ ఆవాసాలు కూల్చేసి మనం అబివృద్ది చెందాలా...!! వాల్ల కన్నీల్లను పన్నీరులా అబివృద్ది పేరుతో త్రాగాలా...!! వాల్లు మనలా ఈ రాష్ట్రంలో ఓటు హక్కు వున్న పౌరులేగా...!! వాల్లకు తల్లి లాంటి ఓడి పకృతి ఆ తల్లిని దూరం చేసి నాగరికత జీవితంలో అనాదలుగా మార్చాలి అని ఆ మార్పుని అబివృద్దీ అంటే ఎట్లా...!!
కొండల్లో బ్రతికే ఆ కొద్ది పాటి బ్రతుకుని రోడ్డు పైకి ఈడ్చుకు వస్తే నీటిలోని చేపల గిల గిల మంటారు...!! అంచేత గిరుజనుల కోరిక మన్నించి బాక్సైట్‌ తవ్వకాన్ని ఆపాలి...!!
వాల్లు మన తోటి ఆంద్రులే వారి కష్టం మన కష్టం అనుకునే వాల్లు పార్టీలకు అతీతంగా ఏలినవారికి తెలిసేలా వ్యతిరేకించండి బాక్సైట్‌ తవ్వకాన్ని...!! నోరులేని అమాయకులకు మద్దతు తెలపండి_/|\_ ప్లీజ్‌.

: Sanjai lanka