డేటింగ్ చేస్తున్న ప్రియమణి!

9 Nov 2015


ప్రియమణి గత కొంతకాలంగా ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలాకాలం వరకూ అతనెవరు అనేది మాత్రం ఇంతకాలం రివీల్ కాలేదు. అయితే ఆ మధ్యన ఆమె బోయ్ ఫ్రెండ్ ఎవరో రివీల్ చేసింది. ముస్తాఫా రాజ్. అతనో ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ ఓనర్. ముంబైలో అతను ఈవెంట్స్ చేస్తూంటాడు. ఈ విషయమై ప్రియమణి చాలా కాలంగా దాస్తూ వచ్చింది. అయితే ఏప్రియల్‌లో వారిద్దరు ఫొటోతో ఇచ్చిన ఫోజులు బయటకొచ్చాయి.

ఇప్పుడు వారిద్దరూ కలిసి తిరిగిన పర్సనల్ ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి. రీసెంట్‌గా ఈ జంట ఓ హాలీడే ట్రిప్‌కు వెళ్లి వచ్చింది. ప్రియమణి మాట్లాడుతూ... ముంబై ఈవెంట్ మేనేజర్ ముస్తఫారాజ్ నా లవర్ . సెలెబ్రిటీ క్రికెట్‌లో పరిచయం అయిన ముస్తఫాకు ముందు నేను ప్రపోజ్ చేశా. ఆ తర్వాత తను ఓకే చేశాడు. ప్రస్తుతం సహజీవనం చేస్తున్నాం, పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో పెళ్లి అంటూ డీటైల్డ్‌గా క్లారిటీ ఇచ్చేసింది ప్రియమణి. 'ఎవరే అతగాడు' మూవీతో హీరోయిన్‌గా తెలుగులో పరిచయమైంది బెంగళూరులో పుట్టిన తమిళ బ్యూటీ ప్రియమణి. 'పెళ్ళైన కొత్తలో', యమదొంగ, కింగ్, గోలీమార్ తదితర సినిమాలతో పాపులరైన ఈమె, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కూడా నటించి సడెన్‌గా సైడ్ అయిపోయిందీ భామ